Innidaam jakkani devu lidivo neegu dorage

ఇన్నిటాఁ జక్కని దేవు లిదివో నీకు దొరకె
Language

(॥పల్లవి॥)
ఇన్నిటాఁ జక్కని దేవు లిదివో నీకు దొరకె
చెన్నుమీర వేడుకతోఁ జిత్తగించవయ్యా

(॥ఇన్ని॥)
వలిపెపయ్యద లోని వలుదచనుగుబ్బలు
కలికి కాటుక సోగకన్నులసొంపు
తలకొన్న పూవులదండల నిలువుఁగొప్ప
చెలియ సొబగులెల్లాఁ జిత్తగించవయ్యా

(॥ఇన్ని॥)
కప్పరపు విడేలచేఁ గడునెఱ్ఱనగుమోవి
చిప్పిలుఁగళలచేఁ జెన్నగుమోము
అప్పళించిన జవ్వాది నలరిన చెక్కులును
చెప్పరా దీపెవొరపు చిత్తగించవయ్యా

(॥ఇన్ని॥)
బంగారు మొలనూళ్లతో బాగై యుండిన పిఱుఁదు
అంగమైన పాదములు హస్తములను
సింగారమయిన కొమ్మ శ్రీవేంకటేశ వురము -
చెంగట నీకున్న దిట్టె చిత్తగించవయ్యా

(||pallavi||)
inniḍām̐ jakkani devu lidivo nīgu dŏragĕ
sĕnnumīra veḍugadom̐ jittagiṁchavayyā

(||inni||)
valibĕbayyada loni valudasanugubbalu
kaligi kāḍuga sogagannulasŏṁpu
talagŏnna pūvuladaṁḍala niluvum̐gŏppa
sĕliya sŏbagulĕllām̐ jittagiṁchavayyā

(||inni||)
kapparabu viḍelasem̐ gaḍunĕṭranagumovi
sippilum̐gaḽalasem̐ jĕnnagumomu
appaḽiṁchina javvādi nalarina sĕkkulunu
sĕpparā dībĕvŏrabu sittagiṁchavayyā

(||inni||)
baṁgāru mŏlanūḽlado bāgai yuṁḍina piṟum̐du
aṁgamaina pādamulu hastamulanu
siṁgāramayina kŏmma śhrīveṁkaḍeśha vuramu -
sĕṁgaḍa nīgunna diṭṭĕ sittagiṁchavayyā