ఇన్నిటా సిగ్గులుదేరె నిఁకనేలే
(॥పల్లవి॥)
ఇన్నిటా సిగ్గులుదేరె నిఁకనేలే
కన్నుల నాపె సొబగు కప్పించుకొమ్మనవే
(॥॥)
కోపించఁజాలక నేను గుట్టుతో నుండఁగాను
యేపురేఁగి తనచేఁత లేల చెప్పీనే
ఆపాటి గలవాఁడు ఆపెనే యీడకుఁ దెచ్చి
యేపొద్దూ మెడఁగట్టుక యెమ్మెచూపుమనవే
(॥॥)
కోరి వెంగెమాడక గుక్కుతా నే నుండఁగాను
యీరీతిఁ దనవలపు లెంతచెప్పీనే
మేరమీర వేడుకై తే మేడమీఁద నిద్దరూ నుండి
వూరివారెల్లాఁ బొగడ నొద్దికగమ్మనవే
(॥॥)
యెడయక శ్రీవేంకటేశుఁడు నేఁ గూడఁగా
వొడలిపై రేకలేల వొగిఁ జెప్పీనే
అడరి శ్రీకాంత నేను అవ్వలిపొందు గలితే
వొడిఁగట్టుక మాయింట నుండి నవ్వుమనవే
(||pallavi||)
inniḍā sigguluderĕ nim̐kanele
kannula nābĕ sŏbagu kappiṁchugŏmmanave
(||||)
kobiṁcham̐jālaga nenu guṭṭudo nuṁḍam̐gānu
yeburem̐gi tanasem̐ta lela sĕppīne
ābāḍi galavām̐ḍu ābĕne yīḍagum̐ dĕchchi
yebŏddū mĕḍam̐gaṭṭuga yĕmmĕsūbumanave
(||||)
kori vĕṁgĕmāḍaga gukkudā ne nuṁḍam̐gānu
yīrīdim̐ danavalabu lĕṁtasĕppīne
meramīra veḍugai te meḍamīm̐da niddarū nuṁḍi
vūrivārĕllām̐ bŏgaḍa nŏddigagammanave
(||||)
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ gūḍam̐gā
vŏḍalibai regalela vŏgim̐ jĕppīne
aḍari śhrīgāṁta nenu avvalibŏṁdu galide
vŏḍim̐gaṭṭuga māyiṁṭa nuṁḍi navvumanave