Innidaa samtosimchi idivo nenu

ఇన్నిటా సంతోసించి ఇదివో నేను
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా సంతోసించి ఇదివో నేను
యెన్నఁగ నీవెఱఁగని వేమున్న విఁకను

(॥ఇన్ని॥)
చెప్పకతొలుతే నీవు చేరి వింటి వామాట
విప్పుచు నేనిఁక విన్నవించేదేమి
అప్పుడే అందుకుఁగాదా అంగమెల్లఁ జెమరించె
కప్పిన నీవలపెల్లా కంటిని నేను

(॥ఇన్ని॥)
సేయకతొలుతే నీవు చేకొంటివి వూడిగము
కాయకముగా నేను కావించేదేమి
నీయందు నందుకేకాదా నిండె మోమునఁ గళలు
ఆయెడ నీపనులెల్లా అవనంటి నేను

(॥ఇన్ని॥)
కూడకతొలుతే నీవే కూడితివి కాఁగిటను
వోడక శ్రీవేంకటేశ వొరసేదేమి
యీడ నీ విందుకేకా ఇటు మేను చొక్కితివి
జాడతోడ నీమతికి సమ్మతైతి నేను

(||pallavi||)
inniḍā saṁtosiṁchi idivo nenu
yĕnnam̐ga nīvĕṟam̐gani vemunna vim̐kanu

(||inni||)
sĕppagadŏlude nīvu seri viṁṭi vāmāḍa
vippusu nenim̐ka vinnaviṁchedemi
appuḍe aṁdugum̐gādā aṁgamĕllam̐ jĕmariṁchĕ
kappina nīvalabĕllā kaṁṭini nenu

(||inni||)
seyagadŏlude nīvu segŏṁṭivi vūḍigamu
kāyagamugā nenu kāviṁchedemi
nīyaṁdu naṁdugegādā niṁḍĕ momunam̐ gaḽalu
āyĕḍa nībanulĕllā avanaṁṭi nenu

(||inni||)
kūḍagadŏlude nīve kūḍidivi kām̐giḍanu
voḍaga śhrīveṁkaḍeśha vŏrasedemi
yīḍa nī viṁdugegā iḍu menu sŏkkidivi
jāḍadoḍa nīmadigi sammadaidi nenu