ఇన్నిటా నే నీకు లోనయినదానరా
(॥పల్లవి॥)
ఇన్నిటా నే నీకు లోనయినదానరా
పన్నిన నీచిత్తము నాభాగ్య మింతేకాని
(॥ఇన్ని॥)
పెలుచునానడుము నీపిడికిటిలోని దింతే
చెలగి నీవెటువలసిన జేయరా
మొలకలనాకుచములే కడుఁగల్లరులు
వులుకనినీవానివోపి కింతేగాని
(॥ఇన్ని॥)
కడు నాచెలువము నీకనుచూపులోని దింతే
అడరి నే నిన్నవుఁగానదన గలనా
కొడిమిగిలిననాగోళ్ళివి కడువాఁడి
బడిబడి నీవానిబలిమింతే కాని
(॥ఇన్ని॥)
కమ్మనినామేను నీకాఁగిటిలోని దింతే
నెమ్మది శ్రీవేంకటేశ నీయిచ్చరా
దిమ్మురేఁచి మఱపించీఁ దియ్యనినామోవి యిది
తెమ్మలైననాలోనిదీమసమే కాని
(||pallavi||)
inniḍā ne nīgu lonayinadānarā
pannina nīsittamu nābhāgya miṁtegāni
(||inni||)
pĕlusunānaḍumu nībiḍigiḍiloni diṁte
sĕlagi nīvĕḍuvalasina jeyarā
mŏlagalanāgusamule kaḍum̐gallarulu
vuluganinīvānivobi kiṁtegāni
(||inni||)
kaḍu nāsĕluvamu nīganusūbuloni diṁte
aḍari ne ninnavum̐gānadana galanā
kŏḍimigilinanāgoḽḽivi kaḍuvām̐ḍi
baḍibaḍi nīvānibalimiṁte kāni
(||inni||)
kammanināmenu nīgām̐giḍiloni diṁte
nĕmmadi śhrīveṁkaḍeśha nīyichcharā
dimmurem̐si maṟabiṁchīm̐ diyyanināmovi yidi
tĕmmalainanālonidīmasame kāni