Innidaa jaanavu neeve yeṟumguduvu

ఇన్నిటా జాణవు నీవే యెఱుఁగుదువు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా జాణవు నీవే యెఱుఁగుదువు
సన్నలనే పతిని వసము సేసుకొంటివి

(॥ఇన్ని॥)
నయాన నాగినమాట నమ్మికలు వుట్టించు
ప్రియాన మొక్కినమొక్కు ప్రేమ రేఁచును
దయతోడి యాదరింపు తగులాయములు సేసు
నియతాన మెలఁగేటి నేరువు లివి

(॥ఇన్ని॥)
మక్ర్కొవఁ జేసినచేఁత మనసులు గరఁగించు
చొక్కుచు నవ్విన నవ్వు సొంపు నిండించు
పక్కనఁ జూచిన చూపు పచ్చిదేర వలపించు
నొక్కొన్న రతులలో నేరుపులివి

(॥ఇన్ని॥)
పొంచుక యుండిన సిగ్గు పొలఇంచు దరితీపు
మంచముపై కూటములు మరిగించును
యెంచి ని న్నలమేల్మంగ యేలె శ్రీవేంకటేశుఁడు
నించుకొన్న మీగుణాల నేరుపు లివి

(||pallavi||)
inniḍā jāṇavu nīve yĕṟum̐guduvu
sannalane padini vasamu sesugŏṁṭivi

(||inni||)
nayāna nāginamāḍa nammigalu vuṭṭiṁchu
priyāna mŏkkinamŏkku prema rem̐sunu
dayadoḍi yādariṁpu tagulāyamulu sesu
niyadāna mĕlam̐geḍi neruvu livi

(||inni||)
makrgŏvam̐ jesinasem̐ta manasulu garam̐giṁchu
sŏkkusu navvina navvu sŏṁpu niṁḍiṁchu
pakkanam̐ jūsina sūbu pachchidera valabiṁchu
nŏkkŏnna radulalo nerubulivi

(||inni||)
pŏṁchuga yuṁḍina siggu pŏla̮iṁchu daridību
maṁchamubai kūḍamulu marigiṁchunu
yĕṁchi ni nnalamelmaṁga yelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
niṁchugŏnna mīguṇāla nerubu livi