Innidaa jaanamdu taanu illaala nenu

ఇన్నిటా జాణఁడు తాను ఇల్లాల నేను
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా జాణఁడు తాను ఇల్లాల నేను
మన్నించుమని మొక్కవే మఱి నామారు నీవు

(॥ఇన్ని॥)
మచ్చికతో నాడేనంటే మాటలెన్నియైనాఁ గల-
విచ్చకుఁ డాతని సుద్దులేమివినేవే
తచ్చితచ్చి నాగుణాలు తానెంతపోగడీనే
రచ్చకెక్కె నావలపు రావే నీవూ

(॥ఇన్ని॥)
చేతులారఁ జేసేనంటే చేఁతలెన్నైనాఁ గలవు
యేతరీఁ డాతనివిద్య లేమిచూచేవే
రీతితో నన్నెంత పెద్దరికముగాఁ జేసీనే
అతని సంతోసించితి ననవే నీవూ

(॥ఇన్ని॥)
వేళతో నేఁ జేప్పేనంటే వింతలెన్నయినాఁ గలవు
యేలిక శ్రీవేంకటేశుఁ డేమి మెచ్చేవే
యీలీల నలమేల్‌మంగ నేను నన్ను నేలినాఁడు
వొలి నోకమనసున నుండవే నీవూ

(||pallavi||)
inniḍā jāṇam̐ḍu tānu illāla nenu
manniṁchumani mŏkkave maṟi nāmāru nīvu

(||inni||)
machchigado nāḍenaṁṭe māḍalĕnniyainām̐ gala-
vichchagum̐ ḍādani suddulemivineve
tachchidachchi nāguṇālu tānĕṁtabogaḍīne
rachchagĕkkĕ nāvalabu rāve nīvū

(||inni||)
sedulāram̐ jesenaṁṭe sem̐talĕnnainām̐ galavu
yedarīm̐ ḍādanividya lemisūseve
rīdido nannĕṁta pĕddarigamugām̐ jesīne
adani saṁtosiṁchidi nanave nīvū

(||inni||)
veḽado nem̐ jeppenaṁṭe viṁtalĕnnayinām̐ galavu
yeliga śhrīveṁkaḍeśhum̐ ḍemi mĕchcheve
yīlīla nalamel‌maṁga nenu nannu nelinām̐ḍu
vŏli nogamanasuna nuṁḍave nīvū