Inni raasula yunigi yimti seluvabu raasha&

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశ&
Year
Language

పల్లవి:

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి

చరణం 1:

కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
వెలగు హరిమధ్యకును సింహరాశి

చరణం 2:

చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి

చరణం 3:

ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిధున రాశి

pallavi:

inni rāsula yunigi yiṁti sĕluvabu rāśhi
kannĕ nī rāśhi kūḍami kaligina rāśhi

saraṇaṁ 1:

kaligi bŏma viṁḍlugala kāṁtagunu dhanurāśhi
mĕlayu minākṣhigini mīnarāśhi
kulugu kusaguṁbhamula kŏmmagunu kuṁbharāśhi
vĕlagu harimadhyagunu siṁharāśhi

saraṇaṁ 2:

sinni magaraṁkabu bayyĕda seḍĕgu magararāśhi
kannĕ prāyabu sadigi kannĕrāśhi
vannĕmaibaiḍi tuladūgu vanidagu tularāśhi
tinnani vāḍi goḽḽa sadigi vṛśhchigarāśhi

saraṇaṁ 3:

āmugŏni nŏrabula mĕrayu nadivagu vṛṣhabharāśhi
gāmiḍi guṭṭumāḍala sadigi kargāḍaga rāśhi
komalabu sigurumovi komaligi meṣharāśhi
prema veṁkaḍabadi kalise priya midhuna rāśhi