Innee neeve yeṟumguduvu yemani seppemu nemu

ఇన్నీ నీవే యెఱుఁగుదువు యేమని చెప్పేము నేము
Language

(॥పల్లవి॥)
ఇన్నీ నీవే యెఱుఁగుదువు యేమని చెప్పేము నేము
నిన్నిందరూఁ బొగడేరు నేరుతువే చెలియా

(॥ఇన్నీ॥)
మచ్చికలు చూపి పతిమనసురా మాఁటలాడి
యిచ్చకమే సేయవలె నింతులకును
మెచ్చఁ గొలువులు సేసి మేలములు వచరించి
ముచ్చటలనే కడు మోహింపించవలెను

(॥ఇన్నీ॥)
కన్నులఁ దప్పకచూచి కానుకలు చేతికిచ్చి
సన్నలనే నవ్వవలె సతులకును
తిన్నఁగా మొక్కులు మొక్కి తేనెమోవినే గొసరి
విన్నపముల నేరుపు లెలయించవలెను

(॥ఇన్నీ॥)
అంగములు సోఁకించి ఆయములు గరఁగించి
సంగతితో నుండవలె సతులకును
యింగిత మెరిఁగి నిన్ను నేలె శ్రీవేంకటేశుఁడు
రంగుగ నీ సతివినే రమియించవలెను

(||pallavi||)
innī nīve yĕṟum̐guduvu yemani sĕppemu nemu
ninniṁdarūm̐ bŏgaḍeru neruduve sĕliyā

(||innī||)
machchigalu sūbi padimanasurā mām̐ṭalāḍi
yichchagame seyavalĕ niṁtulagunu
mĕchcham̐ gŏluvulu sesi melamulu vasariṁchi
muchchaḍalane kaḍu mohiṁpiṁchavalĕnu

(||innī||)
kannulam̐ dappagasūsi kānugalu sedigichchi
sannalane navvavalĕ sadulagunu
tinnam̐gā mŏkkulu mŏkki tenĕmovine gŏsari
vinnabamula nerubu lĕlayiṁchavalĕnu

(||innī||)
aṁgamulu som̐kiṁchi āyamulu garam̐giṁchi
saṁgadido nuṁḍavalĕ sadulagunu
yiṁgida mĕrim̐gi ninnu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
raṁguga nī sadivine ramiyiṁchavalĕnu