ఇన్నాళ్లుఁ బిన్నదిగాని యిప్పుడు వయసు వచ్చె
(॥పల్లవి॥)
ఇన్నాళ్లుఁ బిన్నదిగాని యిప్పుడు వయసు వచ్చె
విన్నవించితిమి నీకు వేడుక చూడవయ్యా
(॥ఇన్నా॥)
మొలచి గుబ్బచన్నులు మొన లెత్తెను
చెలరేఁగి కోరికలు చిగిరించెను
నలుగడ జవ్వనము నన లొతైను
చెలియతో వనకేలి సేతువు రావయ్యా
(॥ఇన్నా॥)
యింతి చెక్కు చెమటల యేరులు వారె
వింతనవ్వుల పూవుల విరియఁ జొచ్చె
చెంతనే గండుమీలు మించెను కన్నుల
చింతదీర జలకేలి సేతువు రావయ్యా
(॥ఇన్నా॥)
చక్కని మోమున నిండె చంద్రకళలు
మిక్కిలి మరబలాలు మేనిపై వాలె
యిక్కడ శ్రీవేంకటేశ యీకె నిన్నుఁ బెండ్లాడె
గక్కన సురతకేలి గావింతువు రావయ్యా
(||pallavi||)
innāḽlum̐ binnadigāni yippuḍu vayasu vachchĕ
vinnaviṁchidimi nīgu veḍuga sūḍavayyā
(||innā||)
mŏlasi gubbasannulu mŏna lĕttĕnu
sĕlarem̐gi korigalu sigiriṁchĕnu
nalugaḍa javvanamu nana lŏdainu
sĕliyado vanageli seduvu rāvayyā
(||innā||)
yiṁti sĕkku sĕmaḍala yerulu vārĕ
viṁtanavvula pūvula viriyam̐ jŏchchĕ
sĕṁtane gaṁḍumīlu miṁchĕnu kannula
siṁtadīra jalageli seduvu rāvayyā
(||innā||)
sakkani momuna niṁḍĕ saṁdragaḽalu
mikkili marabalālu menibai vālĕ
yikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐ bĕṁḍlāḍĕ
gakkana suradageli gāviṁtuvu rāvayyā