ఇన్నాళ్లు నెఱఁగవైతి వింతేసి నీవు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నెఱఁగవైతి వింతేసి నీవు
సన్నలా చాలయా నాపె చదివించెను
(॥ఇన్నా॥)
యితరసతులతో నీ వెపుడు మాటాడకుండా
వ్రతము వట్టించెనా వనిత నీకు
సతమై నమ్మనచోట చలము సాదించుమని
నుతికెక్క బుద్దులెల్లా నూరిపోసెనా
(॥ఇన్నా॥)
యేచి రతివేళ మోవి యెంగి లంటించకుముని
ఆచారాలు నేరిపేనా అంగన నేఁడు
చేచేతఁ గాఁగిలించితే సిగ్గులువడేయట్టుగా
లాచి నీమనసులో మొలవఁబెట్టెనా
(॥ఇన్నా॥)
తడవి చెనకినాను తలవంచుకొనుమని
గడుసరిఁ జేసెనా కామిని నిన్ను
ఆడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
వుడివో కీగుణ మాకె పుపదేశ మిచ్చెనా
(||pallavi||)
innāḽlu nĕṟam̐gavaidi viṁtesi nīvu
sannalā sālayā nābĕ sadiviṁchĕnu
(||innā||)
yidarasadulado nī vĕbuḍu māḍāḍaguṁḍā
vradamu vaṭṭiṁchĕnā vanida nīgu
sadamai nammanasoḍa salamu sādiṁchumani
nudigĕkka buddulĕllā nūribosĕnā
(||innā||)
yesi radiveḽa movi yĕṁgi laṁṭiṁchagumuni
āsārālu neribenā aṁgana nem̐ḍu
sesedam̐ gām̐giliṁchide sigguluvaḍeyaṭṭugā
lāsi nīmanasulo mŏlavam̐bĕṭṭĕnā
(||innā||)
taḍavi sĕnaginānu talavaṁchugŏnumani
gaḍusarim̐ jesĕnā kāmini ninnu
āḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
vuḍivo kīguṇa māgĕ pubadeśha michchĕnā