ఇన్నాళ్లు నెఱఁగము ఇటువంటి సుద్దులు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నెఱఁగము ఇటువంటి సుద్దులు
కన్నుల పండుగఁ గాగఁ గనుఁగొంటి మిపుడు
(॥ఇన్నా॥)
వెలఁది నీసెలవుల వెన్నెల లెంత గాసీనే
పలచని మోవి యేల పచ్చిదేరీనే
నిలువు నివ్వెరగులు నీకెందుండి వచ్చెనే
తెలపి చెప్పవే మాకు తేటతెల్లమిగను
(॥ఇన్నా॥)
తొయ్యలి నీ నొసలిపై తుమ్మిదలేల మూఁగీనే
నెయ్యపుఁగన్నులఁ దొట్టె నిద్దులయేలే
చయ్యనఁ జన్నుల నిండె చందమామపిల్లలేలే
వొయ్యనే యెరిఁగించవే వొప్పగా నీకతలు
(॥ఇన్నా॥)
వనిత నీ చెంపలకు వానలెందుండి వచ్చెనే
తనువుపై హారాలేల తడఁబడీనే
యెనసెనో శ్రీవేంకటేశు నలమేల్మంగవు
మనసారా నానతీవే మగువ నీ పొందులు
(||pallavi||)
innāḽlu nĕṟam̐gamu iḍuvaṁṭi suddulu
kannula paṁḍugam̐ gāgam̐ ganum̐gŏṁṭi mibuḍu
(||innā||)
vĕlam̐di nīsĕlavula vĕnnĕla lĕṁta gāsīne
palasani movi yela pachchiderīne
niluvu nivvĕragulu nīgĕṁduṁḍi vachchĕne
tĕlabi sĕppave māgu teḍadĕllamiganu
(||innā||)
tŏyyali nī nŏsalibai tummidalela mūm̐gīne
nĕyyabum̐gannulam̐ dŏṭṭĕ niddulayele
sayyanam̐ jannula niṁḍĕ saṁdamāmabillalele
vŏyyane yĕrim̐giṁchave vŏppagā nīgadalu
(||innā||)
vanida nī sĕṁpalagu vānalĕṁduṁḍi vachchĕne
tanuvubai hārālela taḍam̐baḍīne
yĕnasĕno śhrīveṁkaḍeśhu nalamelmaṁgavu
manasārā nānadīve maguva nī pŏṁdulu