Innaallu naa kallu grahimchaledu

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు
Year
Language

పల్లవి:

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం...ఉం..ఉమ్మ్..ఉం...

చరణం 1:

చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని...
మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని...
తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో...
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా...ఆ..ఆ..ఆ..

చరణం 2:

ఎవరు చేరి తీర్చగలరు ...మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు ...వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండిపోనా... నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ...ఎన్నినాళ్ళైనా ఇలా....ఆ...ఆ..ఆ...ఉం..ఉం...

pallavi:

innāḽḽu nā kaḽḽu grahiṁchaledu nannu nuvvu sūstuṁṭe
sūbullo ilāṁṭi prema dāgi uṁdani
ĕlā ĕlā kṣhaṇālane vĕnakki rappiṁchaḍaṁ
ĕlā ĕlā gadālane ivvāḽagā mārsaḍaṁ...uṁ..umm..uṁ...

saraṇaṁ 1:

sivaridāgā sĕlimi paṁche silibidaname nīvani...
manasu dāgā seragalige mŏdaḍi pilube nīdani...
tĕliyaguṁḍā iṁta kālaṁ emi seśhāno...
tĕlusugunna veḽalona dūramĕṁtuṁdo ilā...ā..ā..ā..

saraṇaṁ 2:

ĕvaru seri tīrsagalaru ...manasuloni loḍuni
ĕvaru mātraṁ sūbagalaru ...vĕlugu niṁpe toḍuni
ĕduru sūstū uṁḍibonā... nenu iga paina
jñābagānnai migilibonā ...ĕnnināḽḽainā ilā....ā...ā..ā...uṁ..uṁ...