Innaallavalem gaadu yemaninaam geralevu

ఇన్నాళ్లవలెఁ గాదు యేమనినాఁ గెరలేవు
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్లవలెఁ గాదు యేమనినాఁ గెరలేవు
సన్నల నెవ్వతె చేతిసడికి లోనైతివో

(॥ఇన్నా॥)
ఇంతి యెంత దూరినాను యెగ్గుగాదు విభునికి
వింతవింతసంతోసాలై వెలయుఁగాని
పంతగారితనమునఁ బదరే వదేమి నీవు
మంతనాన నెవ్వతెచే మాటఁబాడినాఁడవో

(॥ఇన్నా॥)
మగువ కాఁతాళించితే మగనికి నెగ్గుగాదు
మిగులా వేడుకలై మెరయుఁగాని
తగవులఁ బెట్టి సారెఁ దడవే వదేమి నీవు
పగటున నెవ్వతెచె భంగపడినాఁడవో

(॥ఇన్నా॥)
రమణి కాలుదొక్కితే రమణుని కెగ్గుగాదు
తమితో సమరతులే తగులుఁగాని
జమళి శ్రీవేంకటేశ జరసే వదేమి నీవు
అమర నెవ్వతెచెత నప్పణ గొన్నాఁడవో

(||pallavi||)
innāḽlavalĕm̐ gādu yemaninām̐ gĕralevu
sannala nĕvvadĕ sedisaḍigi lonaidivo

(||innā||)
iṁti yĕṁta dūrinānu yĕggugādu vibhunigi
viṁtaviṁtasaṁtosālai vĕlayum̐gāni
paṁtagāridanamunam̐ badare vademi nīvu
maṁtanāna nĕvvadĕse māḍam̐bāḍinām̐ḍavo

(||innā||)
maguva kām̐tāḽiṁchide maganigi nĕggugādu
migulā veḍugalai mĕrayum̐gāni
tagavulam̐ bĕṭṭi sārĕm̐ daḍave vademi nīvu
pagaḍuna nĕvvadĕsĕ bhaṁgabaḍinām̐ḍavo

(||innā||)
ramaṇi kāludŏkkide ramaṇuni kĕggugādu
tamido samaradule tagulum̐gāni
jamaḽi śhrīveṁkaḍeśha jarase vademi nīvu
amara nĕvvadĕsĕda nappaṇa gŏnnām̐ḍavo