Innaallavalem gaadu idu neevumdelaagu

ఇన్నాళ్లవలెఁ గాదు ఇటు నీవుండేలాగు
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్లవలెఁ గాదు ఇటు నీవుండేలాగు
అన్నిటా నీకు నతఁడే అసమిచ్చెనా

(॥ఇన్నా॥)
చెలరేఁగి చెలరేఁగి చిరునవ్వులు నవ్వేవు
మలసి ని న్నతఁ డట్టె మన్నించెనా
కళదేరీ నీ మోము గర్వము నీకెక్కుడాయ
అలరి యీ పెద్దరిక మాతఁడే వొసగెనా

(॥ఇన్నా॥)
ఆళాపించి ఆళాపించి అట్టె పాటలు వాడేవు
లాలించాతఁడు నీతో మేలము లాడెనా
రాలీఁ గొప్పున విరులు రాఁపుకత్తె వైతివి
ఔలే యీమురిపెము లాతఁడే నేరిపెనా

(॥ఇన్నా॥)
పవళించి పవళించి పానుపుపై నలసేవు
కవగూడెనా శ్రీ వేంకటేశ్వరుఁడు
ఇవల నలమేల్మంగ ను తా నన్నేలినాఁడు
అవసరించేవు నీకు నాతఁడే రమణుఁడా

(||pallavi||)
innāḽlavalĕm̐ gādu iḍu nīvuṁḍelāgu
anniḍā nīgu nadam̐ḍe asamichchĕnā

(||innā||)
sĕlarem̐gi sĕlarem̐gi sirunavvulu navvevu
malasi ni nnadam̐ ḍaṭṭĕ manniṁchĕnā
kaḽaderī nī momu garvamu nīgĕkkuḍāya
alari yī pĕddariga mādam̐ḍe vŏsagĕnā

(||innā||)
āḽābiṁchi āḽābiṁchi aṭṭĕ pāḍalu vāḍevu
lāliṁchādam̐ḍu nīdo melamu lāḍĕnā
rālīm̐ gŏppuna virulu rām̐pugattĕ vaidivi
aule yīmuribĕmu lādam̐ḍe neribĕnā

(||innā||)
pavaḽiṁchi pavaḽiṁchi pānububai nalasevu
kavagūḍĕnā śhrī veṁkaḍeśhvarum̐ḍu
ivala nalamelmaṁga nu tā nannelinām̐ḍu
avasariṁchevu nīgu nādam̐ḍe ramaṇum̐ḍā