ఇన్నాళ్లవాఁడవై యెనసి వుండఁగరాదా
(॥పల్లవి॥)
ఇన్నాళ్లవాఁడవై యెనసి వుండఁగరాదా
వన్నెలు వెట్టుక రాగా వడి నవ్వు వచ్చీని
(॥ఇన్నా॥)
మంతనాననీవు నేనూ మాఁటలాడినట్లానే
పంతమూఁ బాడీ నెఱింగి పలుకరాదా
యింతలోనే నీవిట్లా యెవ్వరోమాటలు నేర్చి
వింతబాస లాడఁగాను వేరె నవ్వు వచ్చీని
(॥ఇన్నా॥)
కఱకరి నిద్దరము కాఁపురము సేసినట్లా
వొఱపు రాజసముతో నుండఁగరాదా
కఱతలజంతలకతలు నేర్చుక వచ్చి
గిఱికొని పొదుగఁగా కేరినవ్వు వచ్చీని
(॥ఇన్నా॥)
చేయిముట్టి నీవు నేనూఁ జెనకినయట్లానే
ఆయముఁ బ్రాయ మెఱింగి యలమరాదా
యీయెడ శ్రీవేంకటేశ యేడోరతులు నేర్చి
నాయెడ నీవు గూడఁగా నవ్వు వచ్చీని
(||pallavi||)
innāḽlavām̐ḍavai yĕnasi vuṁḍam̐garādā
vannĕlu vĕṭṭuga rāgā vaḍi navvu vachchīni
(||innā||)
maṁtanānanīvu nenū mām̐ṭalāḍinaṭlāne
paṁtamūm̐ bāḍī nĕṟiṁgi palugarādā
yiṁtalone nīviṭlā yĕvvaromāḍalu nersi
viṁtabāsa lāḍam̐gānu verĕ navvu vachchīni
(||innā||)
kaṟagari niddaramu kām̐puramu sesinaṭlā
vŏṟabu rājasamudo nuṁḍam̐garādā
kaṟadalajaṁtalagadalu nersuga vachchi
giṟigŏni pŏdugam̐gā kerinavvu vachchīni
(||innā||)
seyimuṭṭi nīvu nenūm̐ jĕnaginayaṭlāne
āyamum̐ brāya mĕṟiṁgi yalamarādā
yīyĕḍa śhrīveṁkaḍeśha yeḍoradulu nersi
nāyĕḍa nīvu gūḍam̐gā navvu vachchīni