ఇన్నాళ్లదాఁకా నీ వెందువోతివే
(॥పల్లవి॥)
ఇన్నాళ్లదాఁకా నీ వెందువోతివే
మన్ననలు మెఱయక మానుదురటే
(॥ఇన్నా॥)
నెట్టన నాతనిమీఁద నిందలాడేదానవు
ఇట్టె తుకాణిచ కేలుందానవే
పట్టపగలాయ నీతో పంతాలాడే విట్టె
కట్టుమట్టులు సేసే దిఁక మరియెన్నఁడే
(॥ఇన్నా॥)
పైకొని పిమ్మటనే పదరేదాన వెదుట
దీకొన కటు వెనకతీతురటవే
కాకుసేసేనంటాను కాచుకున్నదానవు
యీకడ మొకమోటలు యిఁకనేఁటికే
(॥ఇన్నా॥)
యెగ్గులేపట్టేనంటా నెంచుకున్నదానవు
సిగ్గువడి యింత జాగుసేతురటవే
అగ్గమై శ్రీవేంకటేశుఁ డాతఁడిదె నన్నుఁ గూడె
కగ్గుదే నీయెమ్మెలు కానవచ్చెనే
(||pallavi||)
innāḽladām̐kā nī vĕṁduvodive
mannanalu mĕṟayaga mānuduraḍe
(||innā||)
nĕṭṭana nādanimīm̐da niṁdalāḍedānavu
iṭṭĕ tugāṇisa keluṁdānave
paṭṭabagalāya nīdo paṁtālāḍe viṭṭĕ
kaṭṭumaṭṭulu sese dim̐ka mariyĕnnam̐ḍe
(||innā||)
paigŏni pimmaḍane padaredāna vĕduḍa
dīgŏna kaḍu vĕnagadīduraḍave
kāgusesenaṁṭānu kāsugunnadānavu
yīgaḍa mŏgamoḍalu yim̐kanem̐ṭige
(||innā||)
yĕggulebaṭṭenaṁṭā nĕṁchugunnadānavu
sigguvaḍi yiṁta jāguseduraḍave
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍidĕ nannum̐ gūḍĕ
kaggude nīyĕmmĕlu kānavachchĕne