ఇంతులు నీకు బాఁతా యెంత సేసేవు
(॥పల్లవి॥)
ఇంతులు నీకు బాఁతా యెంత సేసేవు
దొంతిఁబెట్టేవు ప్రియము దొడ్డికట్టుదాననా
(॥ఇంతు॥)
నెట్టుకొన్నలకిమమ్మ నీవురము పై నుండఁగా
పట్టేవు మాచన్నులు పై కొసరా
ఱట్టడితనాన మీఱక నీతో రానన్నాను
పెట్టేవు నీసొమ్మెల్లా పెట్టెవంటిదాననా
(॥ఇంతు॥)
చింతదీరఁ దొళశమ్మ శిరసుపై నుండఁగాను
వంతుకు నన్నలమేవు వడ్డిబేరమా
వింతలుగా నిన్నంత వేసరించఁజాలనన్నా
పంతానఁ దమ్మ వెట్టేవు పడిగెపుదాననా
(॥ఇంతు॥)
బూమిదేవులమ్మ నీబుజముపై నుండఁగాను
వేమారు నాతో నవ్వేవు వింతొకచవే
ఆమని శ్రీవేంకటేశ ఆయాలు సోఁకీనన్నా
కామించి కూడితివి నీకాఁపురపుదాననా
(||pallavi||)
iṁtulu nīgu bām̐tā yĕṁta sesevu
dŏṁtim̐bĕṭṭevu priyamu dŏḍḍigaṭṭudānanā
(||iṁtu||)
nĕṭṭugŏnnalagimamma nīvuramu pai nuṁḍam̐gā
paṭṭevu māsannulu pai kŏsarā
ṟaṭṭaḍidanāna mīṟaga nīdo rānannānu
pĕṭṭevu nīsŏmmĕllā pĕṭṭĕvaṁṭidānanā
(||iṁtu||)
siṁtadīram̐ dŏḽaśhamma śhirasubai nuṁḍam̐gānu
vaṁtugu nannalamevu vaḍḍiberamā
viṁtalugā ninnaṁta vesariṁcham̐jālanannā
paṁtānam̐ damma vĕṭṭevu paḍigĕbudānanā
(||iṁtu||)
būmidevulamma nībujamubai nuṁḍam̐gānu
vemāru nādo navvevu viṁtŏgasave
āmani śhrīveṁkaḍeśha āyālu som̐kīnannā
kāmiṁchi kūḍidivi nīgām̐purabudānanā