Imtulalo nishtooramu yemti doradanamu

ఇంతులలో నిష్టూరము యేఁటి దొరతనము
Language

(॥పల్లవి॥)
ఇంతులలో నిష్టూరము యేఁటి దొరతనము
వంతువాసు లెంచవు నీవంటివాఁడే ఘనుఁడు

(॥ఇంతు॥)
అనువెరిఁగి సరసమాడవద్దా నీవలె
ననుచు నిన్నొక చెలి ఆడుకొనెను
మెనుకులే కింతులచే మెప్పించుకొంటివి గాన
నినుపుల జాణఁడవు నీదివో జన్మము

(॥ఇంతు॥)
యెల్లవారికి నిచ్చక మెరిఁగి కూడుదువని
చల్లఁగా నిన్ను నొకతె సంతోసించెను
కల్లగాదు సతులకు కళలు రేఁతువుగాన
బల్లిదుఁడ నీదివో పట్టిన పంతము

(॥ఇంతు॥)
నగుతా నాపెనుఁ గూడి నన్నునుఁ గూడితి విట్టె
తగవెరిఁగిద్దరము దక్కఁగొంటిమి
సగము పంచిచ్చితివి సరుగ నీవయ సెల్ల
నిగుడి శ్రీ వేంకటేశ నేరుపెల్ల నీదివో

(||pallavi||)
iṁtulalo niṣhṭūramu yem̐ṭi dŏradanamu
vaṁtuvāsu lĕṁchavu nīvaṁṭivām̐ḍe ghanum̐ḍu

(||iṁtu||)
anuvĕrim̐gi sarasamāḍavaddā nīvalĕ
nanusu ninnŏga sĕli āḍugŏnĕnu
mĕnugule kiṁtulase mĕppiṁchugŏṁṭivi gāna
ninubula jāṇam̐ḍavu nīdivo janmamu

(||iṁtu||)
yĕllavārigi nichchaga mĕrim̐gi kūḍuduvani
sallam̐gā ninnu nŏgadĕ saṁtosiṁchĕnu
kallagādu sadulagu kaḽalu rem̐tuvugāna
ballidum̐ḍa nīdivo paṭṭina paṁtamu

(||iṁtu||)
nagudā nābĕnum̐ gūḍi nannunum̐ gūḍidi viṭṭĕ
tagavĕrim̐giddaramu dakkam̐gŏṁṭimi
sagamu paṁchichchidivi saruga nīvaya sĕlla
niguḍi śhrī veṁkaḍeśha nerubĕlla nīdivo