Imtulagu nimtaguttu yitturaa neevu

ఇంతులకు నింతగుట్టు యిత్తురా నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతులకు నింతగుట్టు యిత్తురా నీవు
పంతము మెరసేయట్టి బలువుఁడవు

(॥ఇంతు॥)
ముచ్చట నెవ్వతెకైనా మోహము చెప్పుదురా
పచ్చిగా నంతలో కిందుపడుదురా
మచ్చికై సిగ్గువిడిచి మాఁటాలాడుదురా
అచ్చమై బూమేలేటినాయకుఁడవు నీవు

(॥ఇంతు॥)
వెస నాఁటదానికి వెంటవెంటఁ దిరుగుదురా
పసగా నూడిగాలు పైపైఁ జేతురా
నసలుగ సారెసారె నవ్వులు నవ్వుదురా
రసికుఁడవై వట్టిరాజసపునీవు

(॥ఇంతు॥)
దిగ్గనఁ గాఁగిటికిముందే బారచాఁతురా
తగ్గక కూడితి విట్టె తమకింతురా
అగ్గలమై యలసిట్టె అసురుసురౌదురా
యెగ్గులేనిశ్రీవేంకటేశుఁడవు నీవు

(||pallavi||)
iṁtulagu niṁtaguṭṭu yitturā nīvu
paṁtamu mĕraseyaṭṭi baluvum̐ḍavu

(||iṁtu||)
muchchaḍa nĕvvadĕgainā mohamu sĕppudurā
pachchigā naṁtalo kiṁdubaḍudurā
machchigai sigguviḍisi mām̐ṭālāḍudurā
achchamai būmeleḍināyagum̐ḍavu nīvu

(||iṁtu||)
vĕsa nām̐ṭadānigi vĕṁṭavĕṁṭam̐ dirugudurā
pasagā nūḍigālu paibaim̐ jedurā
nasaluga sārĕsārĕ navvulu navvudurā
rasigum̐ḍavai vaṭṭirājasabunīvu

(||iṁtu||)
digganam̐ gām̐giḍigimuṁde bārasām̐turā
taggaga kūḍidi viṭṭĕ tamagiṁturā
aggalamai yalasiṭṭĕ asurusuraudurā
yĕgguleniśhrīveṁkaḍeśhum̐ḍavu nīvu