ఇంతులకు నేరుపులు యిచ్చకములే కాఁబోలు
(॥పల్లవి॥)
ఇంతులకు నేరుపులు యిచ్చకములే కాఁబోలు
చెంత నిన్నిటాను మెరసితివే నీవు
(॥ఇంతు॥)
యెచ్చరించి మొక్కి మొక్కి యెలయించేవు పతిని
అచ్చమైన నెరజాణ వౌదువే నీవు
పచ్చిచేఁతలెల్లాఁజేసి పచారించేవు వలపు
మెచ్చులాడి వన్నిటాను మేలే నీవు
(॥ఇంతు॥)
వినయములెల్లాఁ జేసి వేడుకలు వుట్టించేవు
చెనకి యింకాఁ గొత్తలు సేతువే నీవు
ననుపున మోవి చూపి నానఁబెట్టే వాసలు
మినుకులాఁడివి కడుమేలే నీవు
(॥ఇంతు॥)
చేకొని పాదాలొత్తి చిప్పిలించేవు మనసు
దాకొని యీ పని కెంతదానివే నీవు
యీకడ శ్రీవేంకటేశుఁ డెనసె నన్నును నిన్ను
మేకులాడివి నవ్వేవు మేలే నీవు
(||pallavi||)
iṁtulagu nerubulu yichchagamule kām̐bolu
sĕṁta ninniḍānu mĕrasidive nīvu
(||iṁtu||)
yĕchchariṁchi mŏkki mŏkki yĕlayiṁchevu padini
achchamaina nĕrajāṇa vauduve nīvu
pachchisem̐talĕllām̐jesi pasāriṁchevu valabu
mĕchchulāḍi vanniḍānu mele nīvu
(||iṁtu||)
vinayamulĕllām̐ jesi veḍugalu vuṭṭiṁchevu
sĕnagi yiṁkām̐ gŏttalu seduve nīvu
nanubuna movi sūbi nānam̐bĕṭṭe vāsalu
minugulām̐ḍivi kaḍumele nīvu
(||iṁtu||)
segŏni pādālŏtti sippiliṁchevu manasu
dāgŏni yī pani kĕṁtadānive nīvu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nannunu ninnu
megulāḍivi navvevu mele nīvu