Imtulaala soodare yeege baagulu

ఇంతులాల చూడరే యీకె బాగులు
Language

(॥పల్లవి॥)
ఇంతులాల చూడరే యీకె బాగులు
వింత వింత సింగారాల వినోదించీ నిపుడు

(॥ఇంతు॥)
వెలఁది నవ్వులనే వెన్నెలలు గాసీని
తొలుతనే మొగము చంద్రుఁడు గనక
వలపుల చెమటల వానలు గురిసీని
మెలుపునఁ దురమే మేఘము గనక

(॥ఇంతు॥)
కొనచూపుల దూరనఁ గోలలుగాఁబొంచి యేసీ
నును బొమ్మలే సింగిణులు గనక
తన మాఁటలను తియ్యఁదనములు వెదచల్లీ
నినుపుఁగెమ్మోవి తేనియపెర గనక

(॥ఇంతు॥)
వడిఁ గళల బదారు వన్నెలతో మెరసీని
అడరి తానే కనకాంగి కనక
గుడిగొని పెద్ద చనుఁగొండలతో చెలరేఁగీ
యెడయక శ్రీవేంకటేశు దీవి గనక

(||pallavi||)
iṁtulāla sūḍare yīgĕ bāgulu
viṁta viṁta siṁgārāla vinodiṁchī nibuḍu

(||iṁtu||)
vĕlam̐di navvulane vĕnnĕlalu gāsīni
tŏludane mŏgamu saṁdrum̐ḍu ganaga
valabula sĕmaḍala vānalu gurisīni
mĕlubunam̐ durame meghamu ganaga

(||iṁtu||)
kŏnasūbula dūranam̐ golalugām̐bŏṁchi yesī
nunu bŏmmale siṁgiṇulu ganaga
tana mām̐ṭalanu tiyyam̐danamulu vĕdasallī
ninubum̐gĕmmovi teniyabĕra ganaga

(||iṁtu||)
vaḍim̐ gaḽala badāru vannĕlado mĕrasīni
aḍari tāne kanagāṁgi kanaga
guḍigŏni pĕdda sanum̐gŏṁḍalado sĕlarem̐gī
yĕḍayaga śhrīveṁkaḍeśhu dīvi ganaga