ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు
(॥పల్లవి॥)
ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు
సంతతము నీపె జవ్వన వనమందు
(॥॥)
చెలియమోవినే సింగారము చిగిరించె
అలకల ననలుఁ గొనలు సాగెను
మలసి కరములను మారాకులు వెట్టె
వలపల యీపె జవ్వనవనమందును
(॥॥)
మచ్చికతోడుత మంచిమాటలనే నీడలొ త్తె
పెచ్చు రేఁగి చన్నులను పిందెలు వుట్టె
విచ్చనవిడి నవ్వుల వెన్నెలపంటలు వండె
వచ్చె నామని యీపెజవ్వనవనమందును
(॥॥)
పిఱిఁదిచక్కఁ దనము పెద్ద పెద్దరాసులాయ
కొఱగలతొడలే కొమ్మలాయను
చిఱుఁ జెమటలతోడ శ్రీ వేంకటేశుడు గూడి
వఱలుచు మించె నీజవ్వనవనమందును
(||pallavi||)
iṁtulāla sūḍaramma yĕnnam̐ gŏ ttalu
saṁtadamu nībĕ javvana vanamaṁdu
(||||)
sĕliyamovine siṁgāramu sigiriṁchĕ
alagala nanalum̐ gŏnalu sāgĕnu
malasi karamulanu mārāgulu vĕṭṭĕ
valabala yībĕ javvanavanamaṁdunu
(||||)
machchigadoḍuda maṁchimāḍalane nīḍalŏ ttĕ
pĕchchu rem̐gi sannulanu piṁdĕlu vuṭṭĕ
vichchanaviḍi navvula vĕnnĕlabaṁṭalu vaṁḍĕ
vachchĕ nāmani yībĕjavvanavanamaṁdunu
(||||)
piṟim̐disakkam̐ danamu pĕdda pĕddarāsulāya
kŏṟagaladŏḍale kŏmmalāyanu
siṟum̐ jĕmaḍaladoḍa śhrī veṁkaḍeśhuḍu gūḍi
vaṟalusu miṁchĕ nījavvanavanamaṁdunu