Imtulaala maabu daamkaa nemiseppenu

ఇంతులాల మాపు దాఁకా నేమిచెప్పేను
Language

(॥పల్లవి॥)
ఇంతులాల మాపు దాఁకా నేమిచెప్పేను
అంతరంగాన నున్నాఁడు అన్నియు దా నెఱుఁగును

(॥ఇంతు॥)
యెనసివుండుదుఁగాని యెరవులు సేయనేర
పెనఁగి పైకొందుఁగాని బిగియనేర
ననుపే చూపుదుఁగాని నమ్మక సొదించనేర-
నని విన్నవించరే అన్నియుఁ దా నెఱుఁగు

(॥ఇంతు॥)
చేరి చెలఁగుదుఁగాని చిన్నఁబోయేయందుకోప
సారె మోముచూతుఁగాని జంకించనోప
కూరిమి చల్లుదుఁగాని కోపగించుకొననోప
అరీతి విన్నవించరే యన్నియుఁ దానెఱుఁగు

(॥ఇంతు॥)
సిగ్గులువడుదుఁగాని చిట్టకము సేయఁజాల
వొగ్గి వేడుఁకొందుఁగాని వొరయఁజాల
యెగ్గులేక తానే వచ్చియేలె శ్రీవేంకటేశుఁడు
అగ్గమై విన్నవించరే యన్నియుఁ దానెఱుఁగు

(||pallavi||)
iṁtulāla mābu dām̐kā nemisĕppenu
aṁtaraṁgāna nunnām̐ḍu anniyu dā nĕṟum̐gunu

(||iṁtu||)
yĕnasivuṁḍudum̐gāni yĕravulu seyanera
pĕnam̐gi paigŏṁdum̐gāni bigiyanera
nanube sūbudum̐gāni nammaga sŏdiṁchanera-
nani vinnaviṁchare anniyum̐ dā nĕṟum̐gu

(||iṁtu||)
seri sĕlam̐gudum̐gāni sinnam̐boyeyaṁdugoba
sārĕ momusūdum̐gāni jaṁkiṁchanoba
kūrimi salludum̐gāni kobagiṁchugŏnanoba
arīdi vinnaviṁchare yanniyum̐ dānĕṟum̐gu

(||iṁtu||)
sigguluvaḍudum̐gāni siṭṭagamu seyam̐jāla
vŏggi veḍum̐kŏṁdum̐gāni vŏrayam̐jāla
yĕggulega tāne vachchiyelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
aggamai vinnaviṁchare yanniyum̐ dānĕṟum̐gu