ఇంతు లెంత సేసినాను యియ్యకొనవలెఁ గాక
(॥పల్లవి॥)
ఇంతు లెంత సేసినాను యియ్యకొనవలెఁ గాక
వంతులు వాసు లెంచుకొంటే వాములై నిలువవా
(॥ఇంతు॥)
వచ్చి వచ్చి పొలతురు వలచినవారలు
యెచ్చు గుందులు దడవ నేమున్నది
కొచ్చి చూతు రప్పటిని కోరికగలవారలు
పచ్చిసేసి నవ్వఁబోతే పంతములు రేఁగవా
(॥ఇంతు॥)
వెంగెములే యాడుదురు వేడుకగలవారలు
యింగితా(త?) భావాలు చూడ నేమున్నది
పంగింతు రప్పటిని పాయని పొందులవారు
సంగతులు వెదకితే చలములు మీరవా
(॥ఇంతు॥)
ఆయము లంటఁజూరుదు రాసగలవారలు
యేయెడ సాదించేమన నేమున్నది
చాయల శ్రీవేంకటేశ సతి యలమేలుమంగ
కాయజకేలిది మీకు ఘనతేకాదా
(||pallavi||)
iṁtu lĕṁta sesinānu yiyyagŏnavalĕm̐ gāga
vaṁtulu vāsu lĕṁchugŏṁṭe vāmulai niluvavā
(||iṁtu||)
vachchi vachchi pŏladuru valasinavāralu
yĕchchu guṁdulu daḍava nemunnadi
kŏchchi sūdu rappaḍini korigagalavāralu
pachchisesi navvam̐bode paṁtamulu rem̐gavā
(||iṁtu||)
vĕṁgĕmule yāḍuduru veḍugagalavāralu
yiṁgidā(ta?) bhāvālu sūḍa nemunnadi
paṁgiṁtu rappaḍini pāyani pŏṁdulavāru
saṁgadulu vĕdagide salamulu mīravā
(||iṁtu||)
āyamu laṁṭam̐jūrudu rāsagalavāralu
yeyĕḍa sādiṁchemana nemunnadi
sāyala śhrīveṁkaḍeśha sadi yalamelumaṁga
kāyajagelidi mīgu ghanadegādā