Imtiro paayabuvaari impu liduvamtivi

ఇంతిరో పాయపువారి ఇంపు లిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఇంతిరో పాయపువారి ఇంపు లిటువంటివి
మంతనపు వేడుకలు మర్మములు సోఁకించు

(॥ఇంతి॥)
మతిలోని తమకము మచ్చికలు వుట్టించు
సతతము సంగాతము చవులు రేఁచు
అతిసరసము గడు నాసలకు లోనుసేసు
రతి వినోద మెపుడు రచ్చలఁ బొందించును

(॥ఇంతి॥)
కొనగోరి చెనకులు గుబ్బతిల్లుం(లిం?)చు మనసు
కనుచూపులు చుట్టరిక మంటించును
పెనఁగులాటలు లోలో బెరఇంచుఁ బంతములు
ననుపు లెల్లకాలము నమ్మికలు నెరవు

(॥ఇంతి॥)
జవ్వనపు మదములు సరివెనఁగింపించు
నవ్వు లట్టె వలపులు నాము లెక్కించు
ఇవ్వల శ్రీవేంకటేశుఁ డిన్నిటా నిన్నేలినాఁడు
మవ్వపు వినయములు మరుఁగఁగఁ జేయును

(||pallavi||)
iṁtiro pāyabuvāri iṁpu liḍuvaṁṭivi
maṁtanabu veḍugalu marmamulu som̐kiṁchu

(||iṁti||)
madiloni tamagamu machchigalu vuṭṭiṁchu
sadatamu saṁgādamu savulu rem̐su
adisarasamu gaḍu nāsalagu lonusesu
radi vinoda mĕbuḍu rachchalam̐ bŏṁdiṁchunu

(||iṁti||)
kŏnagori sĕnagulu gubbadilluṁ(liṁ?)su manasu
kanusūbulu suṭṭariga maṁṭiṁchunu
pĕnam̐gulāḍalu lolo bĕra̮iṁchum̐ baṁtamulu
nanubu lĕllagālamu nammigalu nĕravu

(||iṁti||)
javvanabu madamulu sarivĕnam̐giṁpiṁchu
navvu laṭṭĕ valabulu nāmu lĕkkiṁchu
ivvala śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā ninnelinām̐ḍu
mavvabu vinayamulu marum̐gam̐gam̐ jeyunu