Imtini mannimchudagu nidevela

ఇంతిని మన్నించుటకు నిదేవేళ
Language

(॥పల్లవి॥)
ఇంతిని మన్నించుటకు నిదేవేళ
వింత సేయక లోనికి విచ్చేయరాదా

(॥ఇంతి॥)
రచ్చలఁబడె వలపు రాసులై నిండె వలపు
యిచ్చట నాయకుడవు యేమి సే సేవు
పచ్చకప్పురపు ధూళిపాలాయ విరహము
తచ్చిచూచి ఇఁక దయఁతలఁచరాదా

(॥ఇంతి॥)
దొంతులు నిండెఁ గోరిక దొడ్లు చొచ్చెఁగోరిక
ఇంతు లిందరిలో నీవు యేమి సే సేవు
చింత చెక్కిటిచేఁతికి సెలవాయ జవ్వనము
కాంతుఁడ వీపె నింతటఁ గరుణించరాదా

(॥ఇంతి॥)
అడియాలమాయ రతి ఆయములంటెను రతి
యెడయకు మక్కడ నీవేమి సేసేవు
చిడుముడి గూడితివి శ్రీ వేంకటేశ సతిని
పిడికిటిపాలఁ గృపపెట్టఁగరాదా

(||pallavi||)
iṁtini manniṁchuḍagu nideveḽa
viṁta seyaga lonigi vichcheyarādā

(||iṁti||)
rachchalam̐baḍĕ valabu rāsulai niṁḍĕ valabu
yichchaḍa nāyaguḍavu yemi se sevu
pachchagappurabu dhūḽibālāya virahamu
tachchisūsi im̐ka dayam̐talam̐sarādā

(||iṁti||)
dŏṁtulu niṁḍĕm̐ goriga dŏḍlu sŏchchĕm̐goriga
iṁtu liṁdarilo nīvu yemi se sevu
siṁta sĕkkiḍisem̐tigi sĕlavāya javvanamu
kāṁtum̐ḍa vībĕ niṁtaḍam̐ garuṇiṁcharādā

(||iṁti||)
aḍiyālamāya radi āyamulaṁṭĕnu radi
yĕḍayagu makkaḍa nīvemi sesevu
siḍumuḍi gūḍidivi śhrī veṁkaḍeśha sadini
piḍigiḍibālam̐ gṛpabĕṭṭam̐garādā