Imtine tappaga soodu mimde inneem gaanavachchee

ఇంతినే తప్పక చూడు మిందే ఇన్నీఁ గానవచ్చీ
Language

(॥పల్లవి॥)
ఇంతినే తప్పక చూడు మిందే ఇన్నీఁ గానవచ్చీ
వంతువాసుల నేమేల వాదించేమో కానీ

(॥ఇంతి॥)
చెలియ విరహమెల్లా చెక్కుచేతనే వున్నది
వెలయ నేమేల విన్నవించేమో కానీ
నెలకొన్న తమియెల్ల నిలువుననే తోఁచీ
కెలసి యేమని యెఱిఁగించేమో కానీ

(॥ఇంతి॥)
కమలాక్షి మోహమెల్లా కనుచూపుల నున్నది
అమరని మాటఁలేల ఆడేమోకానీ
జమఁళి కాఁక లవెల్లా చల్లుఁజెమట నున్నది
తమితో నేమేల యెడతాఁకేమో కానీ

(॥ఇంతి॥)
ముదితకూటములెల్లా మోముకళనే వున్నది
చెదర నిన్నేల కలఁచితిమోకానీ
యెదుటనే శ్రీవేంకటేశ కూడితి విప్పుడే
యిదె మాసతిని యేల యెఱుఁగమో కానీ

(||pallavi||)
iṁtine tappaga sūḍu miṁde innīm̐ gānavachchī
vaṁtuvāsula nemela vādiṁchemo kānī

(||iṁti||)
sĕliya virahamĕllā sĕkkusedane vunnadi
vĕlaya nemela vinnaviṁchemo kānī
nĕlagŏnna tamiyĕlla niluvunane tom̐sī
kĕlasi yemani yĕṟim̐giṁchemo kānī

(||iṁti||)
kamalākṣhi mohamĕllā kanusūbula nunnadi
amarani māḍam̐lela āḍemogānī
jamam̐ḽi kām̐ka lavĕllā sallum̐jĕmaḍa nunnadi
tamido nemela yĕḍadām̐kemo kānī

(||iṁti||)
mudidagūḍamulĕllā momugaḽane vunnadi
sĕdara ninnela kalam̐sidimogānī
yĕduḍane śhrīveṁkaḍeśha kūḍidi vippuḍe
yidĕ māsadini yela yĕṟum̐gamo kānī