పల్లవి:
ఇంటిలోకి వెల్కం అంటు గేటు తీసినాడు మాస్టరూ
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరూ
అలా అలా హఠత్తుగా అటు ఇటు కరంటు పోగా
నెక్స్ట్ సీను ఏం జరిగింది? జస్ట్ నాకు సిగ్గెస్తోంది
నెక్స్ట్ సీను ఏం జరిగింది? జస్ట్ నాకు సిగ్గెస్తోంది
ఇంటిలోకి వెల్కం అంటు గేటు తీసినాడు మాస్టరూ
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరూ
చరణం 1:
శిష్యురాల చారుశీల శీఘ్రమేవ రోమాన్సు నీకు ప్రాప్తిరస్తు
అక్షరాల దీక్షబూని లవ్వు లోని లెసన్సు నేను ఆలకిస్తూ
అందంతో పరీక్ష ఇప్పుడు
అర్ధాంగి ప్రమోషనెప్పుడూ
ఫలితం రానున్నదీ...
పరువం అవునన్నది...
చరణం 2:
పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయే
పుస్తకాల్లో డిక్ష్నరీలో బ్లాక్ బోర్డ్ లో లిఖించలేని ఆకలాయే
వల్లించేయ్ వయస్సు వాచకం
చెల్లించేయ్ వయ్యారి వేతనం
గురువా లేటెందుకూ
లఘువై రాముందుకూ...