(॥పల్లవి॥)
ఇంటికి విచ్చేసె నీతఁడిదె
జంటయి యున్నాడు జంకింతురటవే
(॥ఇంటి॥)
తలఁచినతలఁపులు తలకూడె మరి
పలికినపలుకులు ప(ఫ?) లియించె
మలసి విభువిమె యి మచ్చము లుండినా
అలుగుదురటవే అంతటిపనికి
(॥ఇంటి॥)
విడువనివేడుకలు విరినాయ మరి
గుడిగాను కూటమి కొనసాగె
యెడనెడ నాతఁడు యెవ్వతెఁ జూచిన
తడవుదురటనే దక్కినపనికి
(॥ఇంటి॥)
చేసినసేఁతలు చెల్లెను నీకిఁక
దాసినపెండ్లి తగులాయ
ఆసల శ్రీవేంకటాధిపుఁడు రతి
సేసె నలతురటె చేకొన్నపనికి
(||pallavi||)
iṁṭigi vichchesĕ nīdam̐ḍidĕ
jaṁṭayi yunnāḍu jaṁkiṁturaḍave
(||iṁṭi||)
talam̐sinadalam̐pulu talagūḍĕ mari
paliginabalugulu pa(pha?) liyiṁchĕ
malasi vibhuvimĕ yi machchamu luṁḍinā
aluguduraḍave aṁtaḍibanigi
(||iṁṭi||)
viḍuvaniveḍugalu virināya mari
guḍigānu kūḍami kŏnasāgĕ
yĕḍanĕḍa nādam̐ḍu yĕvvadĕm̐ jūsina
taḍavuduraḍane dakkinabanigi
(||iṁṭi||)
sesinasem̐talu sĕllĕnu nīgim̐ka
dāsinabĕṁḍli tagulāya
āsala śhrīveṁkaḍādhibum̐ḍu radi
sesĕ naladuraḍĕ segŏnnabanigi