Imtigi raavayyaa neegu nedurusoosee nimti

ఇంటికి రావయ్యా నీకు నెదురుచూచీ నింతి
Language

(॥పల్లవి॥)
ఇంటికి రావయ్యా నీకు నెదురుచూచీ నింతి
జంటలైన మిమ్ముఁ జూచి సంతోసించుకొనేము

(॥ఇంటి॥)
చెలియ చిరునవ్వులు సెలవులఁగారఁజొచ్చె
మొలకల చన్నులు మోపులాయను
కలికి కనుచూపులు కడుఁగడువాండ్లెక్కె
నిలువు నూరు వండె నెలఁత జవ్వనము

(॥ఇంటి॥)
భామ జఘన సంపద పైకొని బండ్లు నిండె
మోమున జంద్రకళలు ముప్పిరిగొనె
ఆముకొన్న సిగ్గులెల్లా నంత నంతఁ జిగిరించె
తామర దంపరలాయ తరుణి జవ్వనము

(॥ఇంటి॥)
కాంత తురుము మొయిలు కారుకమ్మి తలకూడె
చింతలోన నడియాస చిమ్మిరేఁగెను
ఇంతలోనె శ్రీవేంకటేశ యీకెఁగూడితివి
దొంతరభోగమ లాయ తొయ్యలిజవ్వనము

(||pallavi||)
iṁṭigi rāvayyā nīgu nĕdurusūsī niṁti
jaṁṭalaina mimmum̐ jūsi saṁtosiṁchugŏnemu

(||iṁṭi||)
sĕliya sirunavvulu sĕlavulam̐gāram̐jŏchchĕ
mŏlagala sannulu mobulāyanu
kaligi kanusūbulu kaḍum̐gaḍuvāṁḍlĕkkĕ
niluvu nūru vaṁḍĕ nĕlam̐ta javvanamu

(||iṁṭi||)
bhāma jaghana saṁpada paigŏni baṁḍlu niṁḍĕ
momuna jaṁdragaḽalu muppirigŏnĕ
āmugŏnna siggulĕllā naṁta naṁtam̐ jigiriṁchĕ
tāmara daṁparalāya taruṇi javvanamu

(||iṁṭi||)
kāṁta turumu mŏyilu kārugammi talagūḍĕ
siṁtalona naḍiyāsa simmirem̐gĕnu
iṁtalonĕ śhrīveṁkaḍeśha yīgĕm̐gūḍidivi
dŏṁtarabhogama lāya tŏyyalijavvanamu