Imtido nemtibeeraalu yemdaamkaanu

ఇంతితో నేఁటిబీరాలు యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఇంతితో నేఁటిబీరాలు యెందాఁకాను
సంతోసించి మచ్చికలు చల్లఁగరాదా

(॥ఇంతి॥)
చనవరికాంతగాన సతి నీపైఁ జేయిచాఁచె
కొనగోరు దాఁకెనంటిఁ(టాఁ?) గోపగింతురా
ననుపు గలదుగాన నవ్వులెల్లానవ్వె నీతో
కనుఁగొని యందు కీకెఁ గాఁగిలించరాదా

(॥ఇంతి॥)
కూరిమి వనితగాన కొప్పువట్టి నిన్నుఁ దీసె
ఆరీతి జంకించెనంటా నదలింతురా
నేరుపుగలదుగాన నీకఁ(కం?) టే మితిమీరె
గారవించి అందుకిట్టె కాఁగిలించరాదా

(॥ఇంతి॥)
ఇచ్చకపుసతిగాన ఇటు నిన్నుఁ జొక్కించె
పచ్చిసేసెనంటా నిట్టె పదరుదురా
మచ్చికె గలదుగాక మరిగె శ్రీవేంకటేశ
కచ్చుపెట్టి అందు కిట్టె కాఁగిలించరారా

(||pallavi||)
iṁtido nem̐ṭibīrālu yĕṁdām̐kānu
saṁtosiṁchi machchigalu sallam̐garādā

(||iṁti||)
sanavarigāṁtagāna sadi nībaim̐ jeyisām̐sĕ
kŏnagoru dām̐kĕnaṁṭim̐(ṭām̐?) gobagiṁturā
nanubu galadugāna navvulĕllānavvĕ nīdo
kanum̐gŏni yaṁdu kīgĕm̐ gām̐giliṁcharādā

(||iṁti||)
kūrimi vanidagāna kŏppuvaṭṭi ninnum̐ dīsĕ
ārīdi jaṁkiṁchĕnaṁṭā nadaliṁturā
nerubugaladugāna nīgam̐(kaṁ?) ṭe midimīrĕ
gāraviṁchi aṁdugiṭṭĕ kām̐giliṁcharādā

(||iṁti||)
ichchagabusadigāna iḍu ninnum̐ jŏkkiṁchĕ
pachchisesĕnaṁṭā niṭṭĕ padarudurā
machchigĕ galadugāga marigĕ śhrīveṁkaḍeśha
kachchubĕṭṭi aṁdu kiṭṭĕ kām̐giliṁcharārā