ఇంతిపై మొగమోటాన నేల లోఁగేవు
(॥పల్లవి॥)
ఇంతిపై మొగమోటాన నేల లోఁగేవు
సంతసాన నీవు నాపె సందిసేయరాదా
(॥ఇంతి॥)
చెలరేఁగి చెలరేఁగి సేసలు చల్లీ నాకె
సెలవి నవ్వ నీవేల సిగ్గువడేవు
నిలువ దమకములు నిండుకున్న వాకెమీఁద
పిలిచి సరికి బేసిఁ బెనంగరాదా
(॥ఇంతి॥)
వచ్చి వచ్చి నీ మీఁద వసంతమాడీ నాకె
తచ్చి తలవంచి యేల తడబడేవు
మచ్చికతో బులకలు మలగొన్న వాకెమేన
పచ్చి సరసా లెదురుబడి నాడరాదా
(॥ఇంతి॥)
సారె సారె నిన్ను గట్టిచన్నుల నొత్తీ నాకె
కూరిమి నీవేల యింకా గుట్టుచేసేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితి వాకె, కాఁగిట
మేరతోడ నీడుజోడై మెలఁగఁగరాదా
(||pallavi||)
iṁtibai mŏgamoḍāna nela lom̐gevu
saṁtasāna nīvu nābĕ saṁdiseyarādā
(||iṁti||)
sĕlarem̐gi sĕlarem̐gi sesalu sallī nāgĕ
sĕlavi navva nīvela sigguvaḍevu
niluva damagamulu niṁḍugunna vāgĕmīm̐da
pilisi sarigi besim̐ bĕnaṁgarādā
(||iṁti||)
vachchi vachchi nī mīm̐da vasaṁtamāḍī nāgĕ
tachchi talavaṁchi yela taḍabaḍevu
machchigado bulagalu malagŏnna vāgĕmena
pachchi sarasā lĕdurubaḍi nāḍarādā
(||iṁti||)
sārĕ sārĕ ninnu gaṭṭisannula nŏttī nāgĕ
kūrimi nīvela yiṁkā guṭṭusesevu
yīrīdi śhrīveṁkaḍeśha yelidi vāgĕ, kām̐giḍa
meradoḍa nīḍujoḍai mĕlam̐gam̐garādā