Imti yivi soosidenu yemanuno

ఇంతి యివి చూచితేను యేమనునో
Language

(॥పల్లవి॥)
ఇంతి యివి చూచితేను యేమనునో
అంతటిలో నొకవుపాయము చూచుకోవయ్యా

(॥ఇంతి॥)
కూరిమితోడుత నిన్నుఁ గొమ్మ పిలువఁగనంపె
చేరి మా యింటికిని విచ్చేయవయ్యా
జీరలు నీబుజములుః సేనగా నున్న వివిగో
గారాబానఁ బచ్చడము కప్పఁగదవయ్యా

(॥ఇంతి॥)
కమ్మరాను యెదురుగాఁ గానుక లప్పటి నంపె
వుమ్మడిని మేడలోఁ గూచుండవయ్యా
సొమ్ములు వింతలు నేఁడచ్చుగా నీమేన నివే
నెమ్మది నందుకు మాట నేరుచుకోవయ్యా

(॥ఇంతి॥)
బత్తితోడుతను నీకు పానువు వరచె నిదె
కొత్తగా శ్రీవేంకటేశ కూడఁగదయ్యా
హత్తి పెరవాసనలు అవిగో శ్రీసతి యంపె
బత్తితో నేలితివికప్రము పూసుకోవయ్యా

(||pallavi||)
iṁti yivi sūsidenu yemanuno
aṁtaḍilo nŏgavubāyamu sūsugovayyā

(||iṁti||)
kūrimidoḍuda ninnum̐ gŏmma piluvam̐ganaṁpĕ
seri mā yiṁṭigini vichcheyavayyā
jīralu nībujamuluḥ senagā nunna vivigo
gārābānam̐ bachchaḍamu kappam̐gadavayyā

(||iṁti||)
kammarānu yĕdurugām̐ gānuga lappaḍi naṁpĕ
vummaḍini meḍalom̐ gūsuṁḍavayyā
sŏmmulu viṁtalu nem̐ḍachchugā nīmena nive
nĕmmadi naṁdugu māḍa nerusugovayyā

(||iṁti||)
battidoḍudanu nīgu pānuvu varasĕ nidĕ
kŏttagā śhrīveṁkaḍeśha kūḍam̐gadayyā
hatti pĕravāsanalu avigo śhrīsadi yaṁpĕ
battido nelidivigapramu pūsugovayyā