Imti todi yelaadaa lemdaamkaanu

ఇంతి తోటి యేలాటా లెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఇంతి తోటి యేలాటా లెందాఁకాను
చింతదీర చెక్కునొక్కి సేదదేర్చవయ్యా

(॥ఇంతి॥)
చలము లేమిటికయ్య సతితోను
వలచిన మేలు చూడవద్దా నీవు
జలజలఁ జమరించె చందపుమేను
కలసి కాఁగిటిలోనె కాఁకదేర్చవయ్యా

(॥ఇంతి॥)
పంతము లేమిటికయ్య పడఁతితోను
యింత(తి?) సేసినవూడిగా లెంచఁగవద్దా
మంతనాన నిట్టూర్పుల మలసీ నిదె
పొంతనే మరుతంత్రాల బుజ్జగించవయ్యా

(॥ఇంతి॥)
గుంపెన లేమిటికయ్య కోమలితోను
యింపులు దలఁచవద్దా యిప్పుడైనాను
పెంపున నలసె నీతో బెరయుచును
అంపక శ్రీవేంకటేశ ఆదరించవయ్యా

(||pallavi||)
iṁti toḍi yelāḍā lĕṁdām̐kānu
siṁtadīra sĕkkunŏkki sedadersavayyā

(||iṁti||)
salamu lemiḍigayya sadidonu
valasina melu sūḍavaddā nīvu
jalajalam̐ jamariṁchĕ saṁdabumenu
kalasi kām̐giḍilonĕ kām̐kadersavayyā

(||iṁti||)
paṁtamu lemiḍigayya paḍam̐tidonu
yiṁta(ti?) sesinavūḍigā lĕṁcham̐gavaddā
maṁtanāna niṭṭūrbula malasī nidĕ
pŏṁtane marudaṁtrāla bujjagiṁchavayyā

(||iṁti||)
guṁpĕna lemiḍigayya komalidonu
yiṁpulu dalam̐savaddā yippuḍainānu
pĕṁpuna nalasĕ nīdo bĕrayusunu
aṁpaga śhrīveṁkaḍeśha ādariṁchavayyā