ఇంతి సేసినమేలు కిదియా । నీవు
(॥పల్లవి॥)
ఇంతి సేసినమేలు కిదియా । నీవు
వంతుకు వంతే పైపౌఁ గాక
(॥ఇంతి॥)
వెన్నెలరేకులు వెదచల్లీనదె
కన్నుల నీపయిఁగలికి
సన్నపు బొమ్మల జంకెన చీఁకటి
పన్ని నీ వేఁటికిఁ బతి చల్లేవు
(॥ఇంతి॥)
తామరచేతులఁ దగఁ బూజించీ
నామనిసన్నల నతివ
వేమరు సిగ్గులవెడమంచపుడే
గోమునఁ బతిగాఁ గురియించేవు
(॥ఇంతి॥)
నెలఁతకుచంబుల నిమ్మపండు లవె
చలఁగి కానుకిచ్చెను నీకు
బలిమి శ్రీవేంకటపతి విటు చేకొని
పలచనికెమ్మోవి పతి యిచ్చితివి
(||pallavi||)
iṁti sesinamelu kidiyā | nīvu
vaṁtugu vaṁte paibaum̐ gāga
(||iṁti||)
vĕnnĕlaregulu vĕdasallīnadĕ
kannula nībayim̐galigi
sannabu bŏmmala jaṁkĕna sīm̐kaḍi
panni nī vem̐ṭigim̐ badi sallevu
(||iṁti||)
tāmarasedulam̐ dagam̐ būjiṁchī
nāmanisannala nadiva
vemaru siggulavĕḍamaṁchabuḍe
gomunam̐ badigām̐ guriyiṁchevu
(||iṁti||)
nĕlam̐tagusaṁbula nimmabaṁḍu lavĕ
salam̐gi kānugichchĕnu nīgu
balimi śhrīveṁkaḍabadi viḍu segŏni
palasanigĕmmovi padi yichchidivi