Imti seluvame yeedanigi

ఇంతి చెలువమే యీతనికి
Language

(॥పల్లవి॥)
ఇంతి చెలువమే యీతనికి
కంతుని చేఁతలఁ గలసిన వేళ

(॥ఇంతి॥)
చిత్తజకేళి నీచెలికుచగిరు లివి
హత్తినరమణుని కాధ(ద?)రువు
నెత్తమితావులనిట్టూర్పుగములు
కొత్తగుబడలికకును పరిహరము

(॥ఇంతి॥)
వలపులాకటికి వనితలధర మిది
చెలువునికిపు డమసినవిందు
చెలపచెలపమైచెమటలపన్నీరు
తెలియఁగ చలివందిరివో పతికి

(॥ఇంతి॥)
పట్టుగొమ్ము యీపడఁతి దేహలత
గట్టిగా శ్రీవేంకటపతికి
యిట్టె యిన్నియు నీకెకు నితనికి
పట్టినవెల్లా బంగారములు

(||pallavi||)
iṁti sĕluvame yīdanigi
kaṁtuni sem̐talam̐ galasina veḽa

(||iṁti||)
sittajageḽi nīsĕligusagiru livi
hattinaramaṇuni kādha(da?)ruvu
nĕttamidāvulaniṭṭūrbugamulu
kŏttagubaḍaligagunu pariharamu

(||iṁti||)
valabulāgaḍigi vanidaladhara midi
sĕluvunigibu ḍamasinaviṁdu
sĕlabasĕlabamaisĕmaḍalabannīru
tĕliyam̐ga salivaṁdirivo padigi

(||iṁti||)
paṭṭugŏmmu yībaḍam̐ti dehalada
gaṭṭigā śhrīveṁkaḍabadigi
yiṭṭĕ yinniyu nīgĕgu nidanigi
paṭṭinavĕllā baṁgāramulu