Imti parinaamamu nee kidivo vinnavimchidi

ఇంతి పరిణామము నీ కిదివో విన్నవించితి
Language

(॥పల్లవి॥)
ఇంతి పరిణామము నీ కిదివో విన్నవించితి
వింతసేయక లోనికి విచ్చేసి చూడవయ్యా

(॥ఇంతి॥)
అలరి నీవు సతితో నాడినమాఁట దలఁచి
నలుగడ నవ్విననవ్వు దలఁచి
చెలమి మిగుల నీవిచ్చినమన్నన దలఁచి
వులివచ్చి సిగ్గులతో లోలలాడుచున్నది

(॥ఇంతి॥)
చేరి నీవు చెనకిన చెనకులెల్లాఁ దలఁచి
సారెకు నాడిన సరసము దలఁచి
కూరిమి వీరఁగ కొప్పుదువ్వుట తలఁచి
మీరాక కెదురుచూచి నెమ్మదిఁ దానున్నది

(॥ఇంతి॥)
యేకదానఁ జేసిన నీ యిచ్చకములు దలఁచి
చేకొన్న కాఁగిటిలో మచ్చిక దలఁచి
యేకమై శ్రీవేంకటేశ యారతిముందె తలఁచి
మేకొన్న సంతోసమున మెచ్చుకొంటానున్నది

(||pallavi||)
iṁti pariṇāmamu nī kidivo vinnaviṁchidi
viṁtaseyaga lonigi vichchesi sūḍavayyā

(||iṁti||)
alari nīvu sadido nāḍinamām̐ṭa dalam̐si
nalugaḍa navvinanavvu dalam̐si
sĕlami migula nīvichchinamannana dalam̐si
vulivachchi siggulado lolalāḍusunnadi

(||iṁti||)
seri nīvu sĕnagina sĕnagulĕllām̐ dalam̐si
sārĕgu nāḍina sarasamu dalam̐si
kūrimi vīram̐ga kŏppuduvvuḍa talam̐si
mīrāga kĕdurusūsi nĕmmadim̐ dānunnadi

(||iṁti||)
yegadānam̐ jesina nī yichchagamulu dalam̐si
segŏnna kām̐giḍilo machchiga dalam̐si
yegamai śhrīveṁkaḍeśha yāradimuṁdĕ talam̐si
megŏnna saṁtosamuna mĕchchugŏṁṭānunnadi