ఇంతి నీవూ నాడుకోఁగా నేకాంతములెల్ల వింటి
(॥పల్లవి॥)
ఇంతి నీవూ నాడుకోఁగా నేకాంతములెల్ల వింటి
దంతపుటింటిలోనివి దాఁచక చెప్పవయ్యా
(॥ఇంతి॥)
పూసగుచ్చినట్టుచెప్పే బుద్దులెల్లా వింటివా
సేసవెట్టినట్టిపాలు చేకొంటివా
బాసడిగినట్టెల్లాఁ దప్పక నీవిచ్చితివా
ఆసుద్దులు వినవేడుకయ్యాఁ జెప్పవయ్యా
(॥ఇంతి॥)
పాదా లాపె పిసుకఁగ పరిణామించితివా
ఆదిగొని పాడఁగాను ఆలించితివా
పాదులు గిలిగించఁగా పక్కన నవ్వితివా
కాదుకూడదన నేను కలట్టే చెప్పవయ్యా
(॥ఇంతి॥)
సరసములాడఁగాను చనవులిచ్చితివా
మెరసి వూడిగాలెల్ల మెచ్చితివా
యిరవై శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
అరుదాయ నాపెచేఁత లవియుఁ జెప్పవయ్యా
(||pallavi||)
iṁti nīvū nāḍugom̐gā negāṁtamulĕlla viṁṭi
daṁtabuḍiṁṭilonivi dām̐saga sĕppavayyā
(||iṁti||)
pūsaguchchinaṭṭusĕppe buddulĕllā viṁṭivā
sesavĕṭṭinaṭṭibālu segŏṁṭivā
bāsaḍiginaṭṭĕllām̐ dappaga nīvichchidivā
āsuddulu vinaveḍugayyām̐ jĕppavayyā
(||iṁti||)
pādā lābĕ pisugam̐ga pariṇāmiṁchidivā
ādigŏni pāḍam̐gānu āliṁchidivā
pādulu giligiṁcham̐gā pakkana navvidivā
kādugūḍadana nenu kalaṭṭe sĕppavayyā
(||iṁti||)
sarasamulāḍam̐gānu sanavulichchidivā
mĕrasi vūḍigālĕlla mĕchchidivā
yiravai śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
arudāya nābĕsem̐ta laviyum̐ jĕppavayyā