ఇంతి నీ చెలువ మిది యెంతని పొగడవచ్చు
(॥పల్లవి॥)
ఇంతి నీ చెలువ మిది యెంతని పొగడవచ్చు
చెంతనున్న చెలులము చేసినదే భాగ్యము
(॥ఇంతి॥)
చక్కనిదాన నన్నిటా జాణతనాలు నేర్తువు
నిక్కి చీఁకటులుగమ్మీ నీతురుము
ముక్కుసంపంగి పూఁబోలుమోముచంద్రునివంటిది
పక్కన నీపతి చూచి భ్రమసునేకదవే
(॥ఇంతి॥)
జవరాలవు మొదల చల్లుఁజూపులాఁడివి
చివురువలె నీమోవి చెంగలించీని
కవచున్నులు గట్టులు కరికుంభజఘనవు
యివల నీకుఁ బతి మోహించ కెట్లుమానునే
(॥ఇంతి॥)
వొరపరి వన్నిటాను వుదటుగలసతివి
సరసతలు నీవల్ల జాజుకొనీని
సిరులమేల్‌మంగవు శ్రీవేంకటేశుఁ డితఁడు
వరుసతో నిన్నుఁ గూడి వలచునేకదవే
(||pallavi||)
iṁti nī sĕluva midi yĕṁtani pŏgaḍavachchu
sĕṁtanunna sĕlulamu sesinade bhāgyamu
(||iṁti||)
sakkanidāna nanniḍā jāṇadanālu nerduvu
nikki sīm̐kaḍulugammī nīdurumu
mukkusaṁpaṁgi pūm̐bolumomusaṁdrunivaṁṭidi
pakkana nībadi sūsi bhramasunegadave
(||iṁti||)
javarālavu mŏdala sallum̐jūbulām̐ḍivi
sivuruvalĕ nīmovi sĕṁgaliṁchīni
kavasunnulu gaṭṭulu kariguṁbhajaghanavu
yivala nīgum̐ badi mohiṁcha kĕṭlumānune
(||iṁti||)
vŏrabari vanniḍānu vudaḍugalasadivi
sarasadalu nīvalla jājugŏnīni
sirulamelmaṁgavu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
varusado ninnum̐ gūḍi valasunegadave