ఇంతి గడుముద్దరాలు యిన్నిటా జాణవు నీవు
(॥పల్లవి॥)
ఇంతి గడుముద్దరాలు యిన్నిటా జాణవు నీవు
మంతుకెక్క మెల్లనె సమతు??? సేయరాదా
(॥ఇంతి॥)
చిగురాకుఁబెదవిమీఁదఁ జేవ దేరీ నదె సిగ్గు
మొగము చూచితేనే మొక్కీఁజెలి
నగుదురా యింతలోనే నంటున నింత సేసితి
వెగటుమాఁటలఁబెట్టి వెడ్డు వెట్టరాదా
(॥ఇంతి॥)
అద్దపుఁజెక్కుల మీఁద ఆము కవిసీఁ గళలు
వద్దికి రమ్మంటేఁ దలవంచీసతి
అద్దో పచ్చి సేతురా అన్నియు నీ మహిమలే
పెద్దరికములు సేసి పెనఁగఁగరాదా
(॥ఇంతి॥)
నిట్టూర్పుగములతో నిగ్గులుదేరీ రతి
గుట్టు బయలు సేసితే కొంకిఁగాంత
ఇట్టే శ్రీ వేంకటేశ యెనసితి నిద్దరును
నెట్టుకొని సంతోసాల నిండుకుండరాదా
(||pallavi||)
iṁti gaḍumuddarālu yinniḍā jāṇavu nīvu
maṁtugĕkka mĕllanĕ samadu??? seyarādā
(||iṁti||)
sigurāgum̐bĕdavimīm̐dam̐ jeva derī nadĕ siggu
mŏgamu sūsidene mŏkkīm̐jĕli
nagudurā yiṁtalone naṁṭuna niṁta sesidi
vĕgaḍumām̐ṭalam̐bĕṭṭi vĕḍḍu vĕṭṭarādā
(||iṁti||)
addabum̐jĕkkula mīm̐da āmu kavisīm̐ gaḽalu
vaddigi rammaṁṭem̐ dalavaṁchīsadi
addo pachchi sedurā anniyu nī mahimale
pĕddarigamulu sesi pĕnam̐gam̐garādā
(||iṁti||)
niṭṭūrbugamulado nigguluderī radi
guṭṭu bayalu seside kŏṁkim̐gāṁta
iṭṭe śhrī veṁkaḍeśha yĕnasidi niddarunu
nĕṭṭugŏni saṁtosāla niṁḍuguṁḍarādā