Imtesi yaasodagatte lemdaro imkaa neegu

ఇంతేసి యాసోదకత్తె లెందరో ఇంకా నీకు
Language

(॥పల్లవి॥)
ఇంతేసి యాసోదకత్తె లెందరో ఇంకా నీకు
సంతసపుఁ దమకాన చండిపెట్టీఁ గాక

(॥ఇంతే॥)
సతితోడ నీవిటే జాణతనా లాఁగడాను
అతివ వేరొక్కతె నిన్నద్దలించీని
మతకాన నూరఁజుట్టమవు నీ వెవ్వరిసొమ్ము
తతితోడ నెఱఁగక తమకించీఁగాక

(॥ఇంతే॥)
అంగనవొకతెకు నీ వాసపడి పెనఁగఁగా
జంగిలికా వేరొక్కడె కొంగువట్టీని
అంగడిపరమిళ మందరివాఁడవు నీవు
సంగడిఁ దనసమ్మంటా సాదించీఁగాక

(॥ఇంతే॥)
అలమేలుమంగ నీకు నటె వురమొక్కగాను
వెలఁది భూకాంత వీఁపెక్కీని
పొలసి శ్రీవేంకటేశ బువ్వపు మోవి నీది
కలసినచనవునఁ గడుమెచ్చీఁగాక

(||pallavi||)
iṁtesi yāsodagattĕ lĕṁdaro iṁkā nīgu
saṁtasabum̐ damagāna saṁḍibĕṭṭīm̐ gāga

(||iṁte||)
sadidoḍa nīviḍe jāṇadanā lām̐gaḍānu
adiva verŏkkadĕ ninnaddaliṁchīni
madagāna nūram̐juṭṭamavu nī vĕvvarisŏmmu
tadidoḍa nĕṟam̐gaga tamagiṁchīm̐gāga

(||iṁte||)
aṁganavŏgadĕgu nī vāsabaḍi pĕnam̐gam̐gā
jaṁgiligā verŏkkaḍĕ kŏṁguvaṭṭīni
aṁgaḍibaramiḽa maṁdarivām̐ḍavu nīvu
saṁgaḍim̐ danasammaṁṭā sādiṁchīm̐gāga

(||iṁte||)
alamelumaṁga nīgu naḍĕ vuramŏkkagānu
vĕlam̐di bhūgāṁta vīm̐pĕkkīni
pŏlasi śhrīveṁkaḍeśha buvvabu movi nīdi
kalasinasanavunam̐ gaḍumĕchchīm̐gāga