Imtesi madagaalu ne neṟamganivaa

ఇంతేసి మతకాలు నే నెఱఁగనివా
Language

(॥పల్లవి॥)
ఇంతేసి మతకాలు నే నెఱఁగనివా
పొంతనుండి నవ్వేవు పొద్దువోదా నీకు

(॥ఇంతే॥)
తారుకాణ లంతేనేల తగవు నడపరాదా
గారాపునీవెఱఁగనికల్ల వున్నదా
కూరిమిసతులమూఁక కూరిచి తలవంచేవు
పోరులేల పెట్టేవు పొద్దువోదా నీకు

(॥ఇంతే॥)
వొడఁబరచఁగనేల వూరకే వుండఁగరాదా
తడవితిమా నీ వింతయు నేరవా
కడగడ లటు దొక్కి కమ్మి నన్ను వేఁడుకొంటాఁ
బుడికేవు నన్నునీవు పొద్దువోదా నీకు

(॥ఇంతే॥)
నివ్వెర గందఁగనేల నిచ్చలాన నుండరాదా
జవ్వనపునాచేఁత నీసలిగె కాదా
యివ్వల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పువ్వులనేల వేసేవు పొద్దువోదా నీకు

(||pallavi||)
iṁtesi madagālu ne nĕṟam̐ganivā
pŏṁtanuṁḍi navvevu pŏdduvodā nīgu

(||iṁte||)
tārugāṇa laṁtenela tagavu naḍabarādā
gārābunīvĕṟam̐ganigalla vunnadā
kūrimisadulamūm̐ka kūrisi talavaṁchevu
porulela pĕṭṭevu pŏdduvodā nīgu

(||iṁte||)
vŏḍam̐barasam̐ganela vūrage vuṁḍam̐garādā
taḍavidimā nī viṁtayu neravā
kaḍagaḍa laḍu dŏkki kammi nannu vem̐ḍugŏṁṭām̐
buḍigevu nannunīvu pŏdduvodā nīgu

(||iṁte||)
nivvĕra gaṁdam̐ganela nichchalāna nuṁḍarādā
javvanabunāsem̐ta nīsaligĕ kādā
yivvala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
puvvulanela vesevu pŏdduvodā nīgu