Imtasaaladaa ninnu yimka solayanela

ఇంతచాలదా నిన్ను యింక సొలయనేల
Language

(॥పల్లవి॥)
ఇంతచాలదా నిన్ను యింక సొలయనేల
పంతముఁ బలుకు నొక్క పాటేయఁ గదరా

(॥ఇంత॥)
చొక్కి మనతనువులు సోఁకకుండినా నేమి
ఇక్కువ నీనాచూపు లిటు సోఁకెఁగా
మిక్కిలి నీటిలోని మీనములు కన్నులనె
తక్కక చూచితేనే తనివయ్యీఁగదరా

(॥ఇంత॥)
ఇమ్ముల నీనాపాన్పు లెడదవ్వయినా నేమి
చిమ్ము నీపై తలపోఁత చేరువలేకా
పమ్మినకూర్మములు పాసి యెచ్చొటనున్నా
తమ్ముఁదామె తలఁచితే తనివయ్యీఁగదరా

(॥ఇంత॥)
శ్రీవేంకటేశ నీచిత్తము పరాకైనా
వోవరి నాకాఁగిటిలో నున్నాఁడవుగా
యీవలఁ బక్షులు భూమి నెందు మేసి వచ్చినాను
తావులఁ బొదిగితేనే తనివయ్యీఁగదరా

(||pallavi||)
iṁtasāladā ninnu yiṁka sŏlayanela
paṁtamum̐ balugu nŏkka pāḍeyam̐ gadarā

(||iṁta||)
sŏkki manadanuvulu som̐kaguṁḍinā nemi
ikkuva nīnāsūbu liḍu som̐kĕm̐gā
mikkili nīḍiloni mīnamulu kannulanĕ
takkaga sūsidene tanivayyīm̐gadarā

(||iṁta||)
immula nīnābānpu lĕḍadavvayinā nemi
simmu nībai talabom̐ta seruvalegā
pamminagūrmamulu pāsi yĕchchŏḍanunnā
tammum̐dāmĕ talam̐side tanivayyīm̐gadarā

(||iṁta||)
śhrīveṁkaḍeśha nīsittamu parāgainā
vovari nāgām̐giḍilo nunnām̐ḍavugā
yīvalam̐ bakṣhulu bhūmi nĕṁdu mesi vachchinānu
tāvulam̐ bŏdigidene tanivayyīm̐gadarā