Imtanee kabburamauda yeṟamga minnaallu neege

ఇంతనీ కబ్బురమౌత యెఱఁగ మిన్నాళ్లు నీకె
Language

(॥పల్లవి॥)
ఇంతనీ కబ్బురమౌత యెఱఁగ మిన్నాళ్లు నీకె
వింతలెల్లాఁ గంటిమి వెరగయ్యీ మాకు

(॥ఇంత॥)
సతియంపినలేకలు చదువుకచదువుక
కతగాఁ జేప్పేవు వద్దికాంతలకును
తతి నాపెదూతికను దండఁ గూచుండఁబెట్టుక
అతిమోదమున నీ వందరికిఁ జూపేవు

(॥ఇంత॥)
తరుణిమాఁటలు నీవు తలఁచుకతలఁచుక
శిరసూఁచక మెచ్చేవు చెలులతోడ
గరిమ నాపెయంపినపరిమళా లందుకొని
పరగ నందరికినిఁ బంచిపెట్టేవు

(॥ఇంత॥)
సుదతిసొమ్ములపెట్టె చూచుకచూచుక
పదిమారులురచ్చలోఁ బచారించేవు
యిదివో శ్రీవేంకటేశ యిటు మమ్ము నేలితివి
పొదిగి యాపెవలపు బొసఁగించుకొనేవు

(||pallavi||)
iṁtanī kabburamauda yĕṟam̐ga minnāḽlu nīgĕ
viṁtalĕllām̐ gaṁṭimi vĕragayyī māgu

(||iṁta||)
sadiyaṁpinalegalu saduvugasaduvuga
kadagām̐ jeppevu vaddigāṁtalagunu
tadi nābĕdūdiganu daṁḍam̐ gūsuṁḍam̐bĕṭṭuga
adimodamuna nī vaṁdarigim̐ jūbevu

(||iṁta||)
taruṇimām̐ṭalu nīvu talam̐sugadalam̐suga
śhirasūm̐saga mĕchchevu sĕluladoḍa
garima nābĕyaṁpinabarimaḽā laṁdugŏni
paraga naṁdariginim̐ baṁchibĕṭṭevu

(||iṁta||)
sudadisŏmmulabĕṭṭĕ sūsugasūsuga
padimārulurachchalom̐ basāriṁchevu
yidivo śhrīveṁkaḍeśha yiḍu mammu nelidivi
pŏdigi yābĕvalabu bŏsam̐giṁchugŏnevu