ఇంతలోనే వేగిరము తేఁటికి నీకు
(॥పల్లవి॥)
ఇంతలోనే వేగిరము తేఁటికి నీకు
చెంతల నీపె చనవే చెల్లింతువుగాక
(॥ఇంత॥)
నగుతా నాడినమాట నాయములఁ బెట్టుదురా
జిగి నీయింతిని ముద్దు సేతురుగాక
నిగిడి సొలసేమాట నేరములు సేతురా
మెగమోడి ఆపెకు మొక్కు టింతేకాక
(॥ఇంత॥)
సరసమాడినమాట చలము సాదింతురా
సిరుల నన్నిట పెద్దసేతురుగాక
దొరతనపుమాటలకు దొమ్మి నీవు సేతురా
సురతపుమర్శములు సూచించుటగాక
(॥ఇంత॥)
వేడుక కాడినమాట వెంగెములు సేతురా
కూడి చనవులుగఁ జేకొందురుగాక
యీడనె శ్రీవేంకటేశ యెనసెనిన్నీ పెమాట
చూడఁజూడ నియ్యకొని చొక్కు టింతేకాక
(||pallavi||)
iṁtalone vegiramu tem̐ṭigi nīgu
sĕṁtala nībĕ sanave sĕlliṁtuvugāga
(||iṁta||)
nagudā nāḍinamāḍa nāyamulam̐ bĕṭṭudurā
jigi nīyiṁtini muddu sedurugāga
nigiḍi sŏlasemāḍa neramulu sedurā
mĕgamoḍi ābĕgu mŏkku ṭiṁtegāga
(||iṁta||)
sarasamāḍinamāḍa salamu sādiṁturā
sirula nanniḍa pĕddasedurugāga
dŏradanabumāḍalagu dŏmmi nīvu sedurā
suradabumarśhamulu sūsiṁchuḍagāga
(||iṁta||)
veḍuga kāḍinamāḍa vĕṁgĕmulu sedurā
kūḍi sanavulugam̐ jegŏṁdurugāga
yīḍanĕ śhrīveṁkaḍeśha yĕnasĕninnī pĕmāḍa
sūḍam̐jūḍa niyyagŏni sŏkku ṭiṁtegāga