Imtalone valabu neevela daamseve

ఇంతలోనే వలపు నీవేల దాఁచేవే
Language

(॥పల్లవి॥)
ఇంతలోనే వలపు నీవేల దాఁచేవే
అంతటి విభుఁడు నీకు నాస నేయఁగాను???

(॥ఇంత॥)
తప్పక చూచి చూచి తలవంచుకొనేవేమే
ఇప్పుడు నీపతి సన్నలెల్లాఁ జేయఁగా
చిప్పిల నవ్వుల నవ్వి సిగ్గువడే వదియేమే
చొప్పుగా నీ కాతఁడు సుద్దులు చెప్పఁగాను

(॥ఇంత॥)
వీడెమిచ్చి ఇచ్చి నీవు వెరగునొందేవేమే
జాడతో నాతఁడు సరసములాడుఁగా
పాడి పాడి లోలోనె భావము గరఁగేవేమే
యీడు జోడై యాతఁడు నీ ఇచ్చలో నుండఁగాను

(॥ఇంత॥)
కోరి చెనకి గుట్టున నుందానవేమే
యీరీతి శ్రీవేంకటేశుఁ డేలఁగాను
చేరి వద్దఁ గూచుండి చెమరించే వదియేమే
తారుకాణగా నాతఁడే తమి రేఁచఁగాను

(||pallavi||)
iṁtalone valabu nīvela dām̐seve
aṁtaḍi vibhum̐ḍu nīgu nāsa neyam̐gānu???

(||iṁta||)
tappaga sūsi sūsi talavaṁchugŏneveme
ippuḍu nībadi sannalĕllām̐ jeyam̐gā
sippila navvula navvi sigguvaḍe vadiyeme
sŏppugā nī kādam̐ḍu suddulu sĕppam̐gānu

(||iṁta||)
vīḍĕmichchi ichchi nīvu vĕragunŏṁdeveme
jāḍado nādam̐ḍu sarasamulāḍum̐gā
pāḍi pāḍi lolonĕ bhāvamu garam̐geveme
yīḍu joḍai yādam̐ḍu nī ichchalo nuṁḍam̐gānu

(||iṁta||)
kori sĕnagi guṭṭuna nuṁdānaveme
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍelam̐gānu
seri vaddam̐ gūsuṁḍi sĕmariṁche vadiyeme
tārugāṇagā nādam̐ḍe tami rem̐sam̐gānu