Imtalonane yivi remdoo

ఇంతలోననే యివి రెండూ
Language

(॥పల్లవి॥)
ఇంతలోననే యివి రెండూ
చింతలు దమకములు చెలువుఁడ నేఁడు

(॥ఇంత॥)
చెనకుల నీకడ చెనకులు వింటేఁ
దునియనిచిత్తముఁ దుత్తుమురౌ
మునుకొని యిప్పటిమోహము చూచిన
అసలుఁగొనలునై యాసలు వొదలు

(॥ఇంత॥)
ఇంచుకవడి నీ విటురాకుండిన
కంచుఁబెంచు నౌఁ గాయమిది
అంచెలఁ గన్నుల నటు నిన్నుఁ గంటే
పొంచినముదములఁ బులకలు మొలచు

(॥ఇంత॥)
కదియుచు నీ వాకడిమోమైతే
చెదరి కోరికలు చిందరలౌ
యిదె నన్ను శ్రీవేంకటేశ్వర యిటువలె
పొదిగినమోములఁ బొత్తులు గలయు

(||pallavi||)
iṁtalonane yivi rĕṁḍū
siṁtalu damagamulu sĕluvum̐ḍa nem̐ḍu

(||iṁta||)
sĕnagula nīgaḍa sĕnagulu viṁṭem̐
duniyanisittamum̐ duttumurau
munugŏni yippaḍimohamu sūsina
asalum̐gŏnalunai yāsalu vŏdalu

(||iṁta||)
iṁchugavaḍi nī viḍurāguṁḍina
kaṁchum̐bĕṁchu naum̐ gāyamidi
aṁchĕlam̐ gannula naḍu ninnum̐ gaṁṭe
pŏṁchinamudamulam̐ bulagalu mŏlasu

(||iṁta||)
kadiyusu nī vāgaḍimomaide
sĕdari korigalu siṁdaralau
yidĕ nannu śhrīveṁkaḍeśhvara yiḍuvalĕ
pŏdiginamomulam̐ bŏttulu galayu