Imtagamte nemi sedu yimtulaala seppare

ఇంతకంటె నేమి సేతు యింతులాల చెప్పరే
Language

(॥పల్లవి॥)
ఇంతకంటె నేమి సేతు యింతులాల చెప్పరే
అంతటా నా వోజలు తానన్నీ నెఱుఁగునే

(॥ఇంత॥)
చెల్లఁబెట్టవద్దుగాని సేసినచేఁత చెప్పితే
చల్లఁగానే అందుకిట్టె సంతోసించేనే
కల్లకు నోరువఁగాని కాంత నెవ్వతెఁ దెమ్మన్నా
యెల్లవారుఁ జూడఁగానే ఇంటికిఁ దెచ్చేనే

(॥ఇంత॥)
దాఁచుకొనవద్దుగాని తనమేనిగురుతులు
పూఁచి నాకుఁ జెప్పితే నిప్పుడు మెచ్చేనే
రేఁచవద్దుగాని వొకరీతి గుట్టుననుంటే
వూఁచకదాఁచక నేనూ నొద్దికై మొక్కేనే

(॥ఇంత॥)
వింత సేయవద్దుగాని వెస నాకెఁ బెండ్లాడితే
పంతము లాడక సోబానఁ బాడేనే
ఇంతలోనె శ్రీవేంకటేశుఁడు నన్నుఁ గూడె
బంతి నాపె దేవరఁగా భావించేనే

(||pallavi||)
iṁtagaṁṭĕ nemi sedu yiṁtulāla sĕppare
aṁtaḍā nā vojalu tānannī nĕṟum̐gune

(||iṁta||)
sĕllam̐bĕṭṭavaddugāni sesinasem̐ta sĕppide
sallam̐gāne aṁdugiṭṭĕ saṁtosiṁchene
kallagu noruvam̐gāni kāṁta nĕvvadĕm̐ dĕmmannā
yĕllavārum̐ jūḍam̐gāne iṁṭigim̐ dĕchchene

(||iṁta||)
dām̐sugŏnavaddugāni tanamenigurudulu
pūm̐si nāgum̐ jĕppide nippuḍu mĕchchene
rem̐savaddugāni vŏgarīdi guṭṭunanuṁṭe
vūm̐sagadām̐saga nenū nŏddigai mŏkkene

(||iṁta||)
viṁta seyavaddugāni vĕsa nāgĕm̐ bĕṁḍlāḍide
paṁtamu lāḍaga sobānam̐ bāḍene
iṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ gūḍĕ
baṁti nābĕ devaram̐gā bhāviṁchene