Imtagamte mari phala memani seppamgaladu

ఇంతకంటె మరి ఫల మేమని చెప్పఁగలదు
Language

(॥పల్లవి॥)
ఇంతకంటె మరి ఫల మేమని చెప్పఁగలదు
సంతతమైన వలపే సంసారఫలము

(॥ఇంత॥)
సతికి జవ్వనమె జన్మమందిన ఫలము
పతి యాదరించినదె ఫలము
మతికి నింపుగా మంచిమాటాడిన ఫలము
అతికాంక్ష నెప్పుడుఁ బాయకుండుటే ఫలము

(॥ఇంత॥)
ననుపున మోముచూచినప్పుడు నవ్వుటే ఫలము
చనవిచ్చి ఆడేసరసమే ఫలము
మనసు తనివిదీర మర్మములంటుటే ఫలము
కనుఁగొనఁ జూచిచూచి కరఁగుటే ఫలము

(॥ఇంత॥)
ప్రియముతో మేనుసోకఁ బెనఁగినదే ఫలము
నయమునఁ జూపేటిసన్నయే ఫలము
జయమై శ్రీవేంకటేశ్వర యలమేల్మంగను
నియతి గూడితి విఁక నీవే ఫలము

(||pallavi||)
iṁtagaṁṭĕ mari phala memani sĕppam̐galadu
saṁtadamaina valabe saṁsāraphalamu

(||iṁta||)
sadigi javvanamĕ janmamaṁdina phalamu
padi yādariṁchinadĕ phalamu
madigi niṁpugā maṁchimāḍāḍina phalamu
adigāṁkṣha nĕppuḍum̐ bāyaguṁḍuḍe phalamu

(||iṁta||)
nanubuna momusūsinappuḍu navvuḍe phalamu
sanavichchi āḍesarasame phalamu
manasu tanividīra marmamulaṁṭuḍe phalamu
kanum̐gŏnam̐ jūsisūsi karam̐guḍe phalamu

(||iṁta||)
priyamudo menusogam̐ bĕnam̐ginade phalamu
nayamunam̐ jūbeḍisannaye phalamu
jayamai śhrīveṁkaḍeśhvara yalamelmaṁganu
niyadi gūḍidi vim̐ka nīve phalamu