ఇంతటివాఁడవు నిన్ను యేమని పొగడేము
(॥పల్లవి॥)
ఇంతటివాఁడవు నిన్ను యేమని పొగడేము
బంతినే నాపాలిటి భాగ్య ఫలమవు
(॥ఇంత॥)
తగవు దప్పక యేలే తగుమగవాని పొందు
జగములో పతికి సంసారఫలము
మొగమోటగలవాని ముచ్చట మాటల చవి
తెగని తంగేటి జుంటి తేనెలలో తేట
(॥ఇంత॥)
సరవితో మనిపేటి సరసునికాఁగిలి
నిరతిఁగాంతకు నిండు నిధానము
నిరతపుజాణకానినెయ్యముతోడి నవ్వు
సురతపు మర్మముల సొబగుల సోన
(॥ఇంత॥)
భావమెరిఁగి కూడేటి ప్రాణేశు కూటమి
కైవశమై ఫలియించే కల్పతరువు
యీవేళ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చేవదేరిన వలపు చేతిలో మాణికము
(||pallavi||)
iṁtaḍivām̐ḍavu ninnu yemani pŏgaḍemu
baṁtine nābāliḍi bhāgya phalamavu
(||iṁta||)
tagavu dappaga yele tagumagavāni pŏṁdu
jagamulo padigi saṁsāraphalamu
mŏgamoḍagalavāni muchchaḍa māḍala savi
tĕgani taṁgeḍi juṁṭi tenĕlalo teḍa
(||iṁta||)
saravido manibeḍi sarasunigām̐gili
niradim̐gāṁtagu niṁḍu nidhānamu
niradabujāṇagāninĕyyamudoḍi navvu
suradabu marmamula sŏbagula sona
(||iṁta||)
bhāvamĕrim̐gi kūḍeḍi prāṇeśhu kūḍami
kaivaśhamai phaliyiṁche kalbadaruvu
yīveḽa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sevaderina valabu sedilo māṇigamu